Canada ottawa parliament firing update

ottawa parliament firing update, ottawa parliament firing accused, canada parliament attack, canada latest news, obama on ottawa parliament firing, narendra modi on ottawa parliament firing, latest news, world latest news, ottawa parliament attackers search

canada ottawa parliament firing update : canada police still on search operations for ottawa parliament attack accused persons they suspect atleast one will hide behind the conspirancy. indian prime minister narendra modi and us president obama feels sad on canada parliament firing

అట్టావా నిందితుల కోసం కొనసాగుతున్న కెనడా వేట

Posted: 10/23/2014 12:57 PM IST
Canada ottawa parliament firing update

దేశ రాజధాని అట్టావాలో పార్లమెంటు భవనంపై దాడి చేసిన నిందితుల కోసం కెనడా పోలిసులు విస్రృతంగా గాలిస్తున్నారు. ఈ దాడిలో ముగ్గురికంటే ఎక్కువమంది పాల్గొని ఉంటారని పోలిసులు అనుమానిస్తున్నారు. భద్రతా బలగాల కాల్పుల్లో ఒకరు హతం కాగా.., మిగతా వారికోసం వేట కొనసాగుతోంది. బుధవారం జరిగిన కాల్పులతో కెనడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది ముందుగా యుద్ద స్మారక స్థూపం వద్ద సైనికుడిపై కాల్పులు జరిపిన దుండగులు ఆ తర్వాత పార్లమెంటు భవనం వద్ద కాల్పులకు తెగబడ్డారు.

వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు మొదలు పెట్టాయి. ఈ కాల్పుల్లో ఒక దుండగుడు హతమయ్యాడు. అటు ముష్కరులు జరిపిన దాడుల్లో ఒక సైనికుడు చనిపోగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటన జరిగిన వెంటనే ఈ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. పార్లమెంటులో ఉన్న సభ్యులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అటు పార్లమెంటు సమీపంలోని భవనాలను కూడా ముందస్తు జాగ్రత్తగా మూసివేయించారు. ఈ కాల్పులతో కెనడా అంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు.

కాల్పులతో పార్లమెంటు సభ్యులంతా భయాందోళనకు గురయ్యారు. తామంతా క్షేమంగా ఉన్నామనీ.., అయితే లోపల తలుపులు వేసుకుని దాక్కున్నట్లు వివరించారు. ఈ ప్రమాదంపై భారత ప్రధాని నరేంద్రమోడి విచారం వ్యక్తం చేశారు. మష్కరుల దాడితో తాను కలత చెందినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు శాంతియుత వాతావరణంకు విఘాతం కల్గిస్తాయన్నారు. అందరూ బాగుండాలని ప్రార్ధిస్తున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అటు ఈ కాల్పులపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆరా తీశారు. నిఘావర్గాల నుంచి సమాచారం సేకరించారు. దాడికి గల కారణాలు, దాడి చేసిన అనుమానిత వ్యక్తులపై సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.

 

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ottawa  parliament firing  terrorists  latest update  

Other Articles