Mr president do not touch my lover says a man to obama

barrack obama, us president, voting, do not touch my lover, Ais cooper, chikago, mike jones, Michel obama

mr president do not touch my lover says a man to obama

ముట్టుకోవద్దు.. అంటే ముద్దే పెట్టుకున్నాడు ఒబామా..!

Posted: 10/22/2014 04:21 PM IST
Mr president do not touch my lover says a man to obama

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఓటు వేయడానికి షికాగో వెళ్లిన ఆయనకు.. ఓ వ్యక్తి తారసపడి.. 'మిస్టర్ ఒబామా.. నా ప్రేయసిని ముట్టుకోవద్దు' అన్నాడు. దీంతో ఒబామా కొంత సేపు షాక్ కు గురయ్యాడు. ఆ వెనువెంటనే తేరుకుని.. అకారణంగా తనను తన సోదరుడు ఇబ్బంది గురిచేయాలనుకునే దానికి ఇదే ఉదాహరణ అంటూ ఒబామా నవ్వుకుంటూ అన్నారు.

మీకు అర్థమైనట్టు లేదు కదూ.. షికాగోలో జరుగుతున్న ఓటింగ్ లో ఓటు వేసేందుకు వెళ్లిన ఓబామాకు ముందు ఓ యువతి ఓటు వేయడానికి నిల్చుంది. అయితే తన దేశంలో ఎక్కడైన పర్యటించినా.. ఎవరు కనబడినా సరదాగా మాట్లాడే ఒబామా.. ఆయనకు ముందున్న తన ప్రేయసి అలి కూపర్ తో ఎక్కడ మాట్లాడతాడో, ఎక్కడ ముందుపెడతాడోనని అందోళన చెందిన మైక్ జోన్స్ అనే యువకుడు ఒబామాతో తన ప్రేయసిని ముట్టుకోవద్దని అన్నాడు. అది విని షాక్ కు గురైన ఒబామా తరువాత తేరుకుని అకారణంగా ఇబ్బంది గురిచేయాలనుకునే దానికి ఇదే ఉదాహరణ అంటూ నవ్వుతూ బదులిచ్చారు. షాక్ నుంచి తేరుకున్న అలి కూపర్ జోన్స్ ఎంత పిచ్చివాడంటే.. అసలు అతనికి తెలియదు ఎవరితో ఎలా మనగలగాలనో అంటూ అలికూపర్ ఒబామాకు విచారం వ్యక్తం చేసి క్షమాపణ కోరింది. ఎంత దారుణంగా మీ మనసును గాయపర్చాడని బాధను వ్యక్తం చేసింది.

అయితే ఒబామా కూడా దీన్ని చాలా తేలిగ్గా తీసుకుని, కూపర్కు ఓ కొద్దిసేపు మచ్చటించి.. చిన్నపాటి కౌగిలి, ముద్దు ఇచ్చారు. జొన్స్ తన గురించి ఏమైనా మాట్లాడాలి కదా అందుకే ఈ ముద్దు ఇస్తున్నాంటూ చమత్కరించారు. కూపర్ మాత్రం మేమేం తక్కువ తిన్నానా.. అంటూ ఒబామాకు పంచ్ వేసింది. ఒబామాకు తనను కేవలం బుగ్గమీదే ముద్దు పెట్టుకున్నారని, అందువల్ల మిషెల్ దీని గురించి ఏమీ అనుకోవద్దని అన్నింది దీంతో పోలింగ్ బూత్లో నవ్వులు విసరబూసాయి.

 

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : barrack obama  us president  voting  do not touch my lover  Ais cooper  chikago  mike jones  Michel obama  

Other Articles