Telangana uses up dam water for power makes andhra pradesh furious

Telangana, Andhra Pradesh, srisailam dam, power demand, agriculture sector, Krishna River Management Board, Nagarjunasagar

Telangana uses up dam water for power makes Andhra Pradesh furious

రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపిన జలం, విద్యుత్..

Posted: 10/21/2014 07:21 PM IST
Telangana uses up dam water for power makes andhra pradesh furious

అవి రెండు తెలుగు రాష్ట్రాలే. అయినా సరే ఒకరిపై మరోకరు అధిపత్యం కోసం యత్నిస్తున్నారు. మా అవసరాలు ముఖ్యం.. మీకు కష్టమైనా, నష్టమైనా మాకేంటి అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనే అధికారంలో వున్న పార్టీలు పంతాలు కూడా అలాగే వున్నాయి. ఇద్దరు చంద్రులు తమదే పైచేయి వుండాలన్న భావతో వ్యవహరిస్తూ.. ప్రజల మధ్య వైరుద్యాలను ఇంకా పెంచుతున్నారు. పాలనను పక్కనబెట్టి ప్రతీకారం కోసం పరుగులు తీస్తున్నారు. తాజాగా శ్రీశైలం జలవిద్యత్ ఉత్పత్తి వివాదంతో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య మరింత అగాధాన్ని పెంచుతోంది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల మధ్య శ్రీశైలం జలవిద్యుత్‌ ఉత్పత్తి వివాదం మరింత ముదిరింది. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రం నుంచి విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం కోరగా, ఉత్పత్తిని కొనసాగిస్తామని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో కృష్ణా వాటర్‌ బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. అయితే ప్రాజెక్టులో నీటిమట్టం 805 అడుగులకు చేరేవరకు ఇబ్బంది లేదని తెలంగాణ సర్కారు తెలిపింది. ఈ క్రమంలో ప్రాజెక్టు వద్ద టెన్షన్‌ వాతావరణం నెలకొంది. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర ఇరు రాష్ర్టాల పోలీసులు భారీగా మోహరించాయి. ప్రభుత్వాలు పట్టుదలకు పోవడంతో. పోలీసులకు .శరఘాతంగా మారింది.

తెలంగాణలో విద్యుత్‌ ఉత్పత్తికి, సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తిని కొనసాగించాలని తెలంగాణ .ప్రభుత్వం నిర్ణయించింది. కనీస నీటిమట్టం 854 అడుగుల వరకూ విద్యుత్‌ ఉత్పత్తిని కొనసాగించనున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 860 అడుగులుగా ఉంది. ఈ క్రమంలో మరో 10 నుంచి 15 రోజుల పాటు విద్యుత్‌ ఉత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 
శ్రీశైలం ప్రాజెక్టులో నీరుశాతం తగ్గిపోతున్నందున వెంటనే విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేయాలని రెండు రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ కోరింది. అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో రివర్‌బోర్డు చైర్మన్‌ కృష్ణపండిట్‌కు ఫిర్యాదు చేసింది. ఇరు రాష్ర్టాల చీఫ్‌ ఇంజనీర్ల సమావేశంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రాజెక్టులో 854 అడుగుల కనీస నీటిమట్టం కొనసాగించాల్సి ఉందని అయితే ఈ ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఏపీ ప్రభుత్వం తన ఫిర్యాదులో పేర్కొంది.
 
విద్యుత్‌ ఉత్పత్తికి శ్రీశైలం నీటిని వినియోగిస్తే వేసవిలో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా అన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం విద్యుత్‌ ఉత్పత్తిని ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఉత్పత్తి ఆపాలంటే తమకు 300 మెగావాట్ల విద్యుత్‌ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి షరుతు విధించగా, 200 మెగావాట్ల విద్యుత్‌ ఇచ్చేందుకు ఏపీ సుముఖత వ్యక్తం చేసింది. ఈ విషయంలో రెండు ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు.
 
తెలంగాణ రైతాంగాన్ని కాపాడేందుకు ఎంత విద్యుత్ కావాలో చర్చించుకుని ఇస్తామని చెప్పారు. కృష్ణాజలాలను కాపాడుకుంటూ రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని, తెలంగాణ మంత్రి హరీశ్‌రావు నుంచి తనకెలాంటి సమాచారం రాలేదని దేవినేని చెప్పారు. గుజరాత్ పర్యటనలో ఉన్న కేటీఆర్‌తో మాట్లాడినా స్పందన రాలేదన్నారు. పక్క రాష్ట్రాలు విద్యుత్తు ఇస్తామన్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని దేవినేని ఉమా ఆరోపించారు. జీవో 107, 69 కచ్చితంగా అమలుచేస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణకు విద్యుత్తు ఇవ్వడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే అడిగినంత విద్యత్ ఇవ్వకపోవడం, నీటిని పథిలంగా వుంచుకోవడంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి తెరలేచింది. అటు నల్గొండ జిల్లాలో టీడీపీ పార్టీ కార్యాలయాన్ని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ధ్వంసం చేశారు. దీనిపై స్పందించిన టీడీపీ నేతలు తెలంగాణ భవనాన్ని కూడా భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. ఇలా రావణ కాష్టంలో ఇరు రాష్ట్రాల ప్రజలు రెచ్చగోట్టే దోరణికి ఇకనైనా పార్టీలు, ప్రభుత్వాలు, నేతలు విడనాడాలి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles