Pakistan tehreek e insaf party president imran khan given bumper offer to hindus

cricketer imran khan, pakistan tehreek e insaf party president imran khan, pti party news, imran khan statements, imran khan comments, pakistani politics

pakistan tehreek e insaf party president imran khan given bumper offer to hindus

హిందువులకు పాక్ నాయకుడు ఇమ్రాన్ బంపరాఫర్!

Posted: 10/20/2014 07:14 PM IST
Pakistan tehreek e insaf party president imran khan given bumper offer to hindus

భారతదేశంలో కులం, మతం పేర్లను అడ్డంపెట్టుకుని రాజకీయం చేసే ఎందరో నాయకులు వున్నారు. మా పార్టీనే గెలిపిస్తే ఫలానా కులానికి ఇంత రిజర్వేషన్ ఇస్తాం.. ఇన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ ప్రచారాలు చేసుకున్న నాయకులు - సందర్భాలూ కోకొల్లలు! ఇదిలావుండగా.. మొన్నటికిమొన్న రాజకీయరంగంలో ఎంట్రీ ఇచ్చుకున్న పాకిస్తాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సరికొత్త నినాదంతో సంచలనం సృష్టించాడు. ప్రస్తుతమున్న నవాజ్ షరీఫ్ అధికారాన్ని ఏదోఒకరకంగా తప్పుబడుతూ తీవ్ర విమర్శలు గుప్పించే ఇమ్రాన్... అతనిని గద్దెనుంచి తొలగించాలని ఎన్నోరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే తాజాగా ఒక ప్రకటనను విడుదల చేశాడు.

దేశం నుంచి పారిపోయిన హిందువులందరూ తమ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధికారంలోకి రాగానే తిరిగి పాక్ కు వస్తారని ఆ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ తెలిపాడు. ఈ విషయంపై అతను మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ దేశంలో ఎన్నో దురాగతాలను ఎదుర్కొన్న హిందు కమ్యూనిటీ ప్రజలందరూ.. నా పార్టీ అధికారంలోకి వచ్చాక తిరిగి వస్తారు’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ విధంగా అయితే దేశంలో ముస్లింలకు హక్కులు కల్పించారు.. అలాగే హిందువులకు కూడా కల్పిస్తామనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇకనుంచి హిందువులు కూడా పాకిస్తాన్ లో స్వేచ్ఛగా బతకవచ్చుననే హామీని ప్రకటించినట్లు సమాచారం!

అంతేకాదు.. పాకిస్తాన్ లో ఇప్పటికే కొన్ని ముస్లిం వర్గాలు హిందువులను బలవంతంగా మతమార్పిడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా అక్కడున్న టెర్రరిజమే ఇటువంటి ప్రయత్నాలకు ఒడిగడుతుంటారని సమాచారం! దీంతో ఈ విషయంపై స్పందించిన ఆయన.. హిందువులు, కలాష్ కమ్యూనిటీలను బలవంతంగా ఇస్లాంలోకి మార్పు చేయడంపై విచారం వ్యక్తం చేశారు. తన పార్టీ అధికారంలోకి రాగానే అటువంటి సంస్కృతి వుండదని, ఒకవేళ ఎవరైనా బలవంతం చేయడానికి ప్రయత్నిస్తే వారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన తెలిపినట్లు తెలుస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles