Indian political leaders selfish about cabinet posts

indian politics, indian political leaders, india latest updates, latest india political news, narendra modi cabinet, central government, central cabinet, union cabinet list, union ministers of india, telangana cabinet ministers list, andhrapradesh cabinet ministers list, telugu latest updates

indian political leaders selfish about cabinet posts : all parties leader in India are thinking about cabinet seats only they not bother about public service it appears in congress, bjp, ncp, tdp, trs, cpi, cpm, sp, bsp and also in all parties

ప్రజా సేవ వద్దు... పదవులే మాకు ముద్దు

Posted: 10/17/2014 06:21 PM IST
Indian political leaders selfish about cabinet posts

మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజలే దేవుళ్ళుగా పాలకులు భావిస్తారు. ఈ మాటలు కేవలం కాగితాలకే పరిమితం. ఆచరణ విషయంలోకి వచ్చే సరికి అంతా రివర్స్. పాలకులు ప్రభువులు అయితే ప్రజలు.. వారి బానిసలుగా మారుతున్నారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని అంతా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో అది చేస్తాం ఇది చేస్తాం అంటున్న నాయకులు గెలిచాక ఏమి చేయటం లేదు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా.. ఏ నేతను చూసినా ఏమున్నది చెప్పుకోవటానికి.

ఎన్నికల్లో గెలిచిన నేతలంతా ప్రజాసేవ కంటే పదవుల కోసమే ఎక్కువగా ఆశపడుతున్నారు. తమకు మంత్రి పదవి రావాలని.., ఎస్కార్టు వాహనాలు వెంట తిరగాలని కలలు కంటున్నారు. ఇందుకోసం కుల, మత, వర్గ, ప్రాంత ఇలా ఏది అవసరం అయితే దాన్ని వాడేసుకుని పదవులు పొందేందుకు ప్రభుత్వ నేతల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. చివరకు మంత్రి పదవి లభించకపోతే వెంటనే రాజీనామాలు చేస్తున్నారు. మంత్రి పదవి లేకపోతే ప్రజా సేవకు పనికి రారా... మంత్రిగా ఉంటేనే పనులు జరుగుతాయా? అని ఎవరైనా ప్రశ్నిస్తే తప్పించుకు తిరుగుతున్నారు తప్ప తాము చేస్తున్న తప్పు తెలుసుకోవటం లేదు.

ప్రజా ప్రతినిధులను ఓట్లేసి గెలిపించేది ప్రజలు. వారు పనిచేయాల్సింది ఓట్లేసిన నియోజకవర్గ ప్రజల కోసం. కాని మన నేతలు మాత్రం అలా చేయటం లేదు. ప్రజా ప్రతినిధి అవగానే పదవులపై దృష్టి పెడుతున్నారు. పదవులు వరించకపోతే రాజీనామాలు చేస్తున్నారు. ఈ సమయంలో రాజీనామా చేస్తే నియోజకవర్గ పరిస్థితి ఏమిటి? తమపై నమ్మకంతో ఓట్లేసిన ప్రజలు ఏమనుకుంటారు.. వారిని ఒక మాట అడగాలి అని ఏ నేతా ఆలోచించటం లేదు. పైగా తామేదో గొప్ప పని చేసినట్లుగా రాజీనామా చేసి మీడియా ముందుకు వచ్చి తమకు అన్యాయం జరిగిందంటూ ఆవేదనలు వ్యక్తం చేస్తారు. కానీ లక్షల మంది ప్రజలకు వారు చేస్తున్న అన్యాయం గురించి మాత్రం ఆలోచించరు.

ఇది మారాలంటే..?

పదవుల కోసం, టికెట్ల కోసం రాజీనామాలు చేసే ప్రజా ప్రతినిధుల వైఖరి మారాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ప్రజా ప్రతినిధిగా గెలవాలంటే కనీసం 51శాతం ప్రజల మద్దతు ఉండాలి. కానీ రాజీనామా చేసేందుకు ఇది అవసరం లేదు. కాబట్టి వీరు ఇలా ఇష్టం వచ్చినట్లుగా రాజీనామా డ్రామాలు ఆడుతున్నారు. తాము ఎన్నుకున్న ప్రజా ప్రతినిధి రాజీనామా చేసినట్లు టీవీల్లో చూసే వరకు జనాలకు తెలియని దుస్థితి ఏర్పడుతోంది. ఈ ఆటలు కట్టిపెట్టాలంటే.. రాజీనామాలకు కూడా ప్రజల మద్దతు కావాలి అనే నిబందన తేవాలి. ఇందుకోసం ప్రజలంతా ఓట్లేయనవసరం లేదు. వారి తరపున ప్రతి గ్రామం తరపున ఆ ఊరి సర్పంచ్ ప్రజల అభిప్రాయం తెలుసుకుని ఓటు వేస్తే.. అందులో వచ్చిన ఫలితం ఆధారంగా రాజీనామా చేయాలా వద్దా అనేది తేలుతుంది. తమ నేతకు నిజంగా అన్యాయం జరిగింది అని ప్రజలు భావిస్తే వారే రాజీనామా చేయమని చెప్తారు. అప్పడే నిజమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది... డెమోక్రసీ అర్దంకు సార్దకత ఏర్పడుతుంది. ఇది జరుగుతుంది అనుకోలేము.., కాని అమలు కావాలని అంతా ఆకాంక్షిద్దాం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cabinet  mla  mp  latest updates  

Other Articles