Only thousand crores announcement for lakh crores loss

hudhud victims, cyclone, andrapradesh, MP lads, rajya sabha, Rs. 1000 crores, announcement, lakh crores, hudhud loss, chiranjeevi

only thousand crores announcement for lakh crores hudhud cyclone loss..? asks MP chiranjeevi

లక్ష కోట్ల నష్టానికి.. వెయ్యి కోట్లే విధుల్చుతారా..? మోడీ గారు..

Posted: 10/15/2014 03:53 PM IST
Only thousand crores announcement for lakh crores loss

విశాఖ కైలాసగిరి వద్ద తీరాన్ని తాకి, పుడిమడిక వద్ద తీరాన్ని దాటి ఉత్తరాంధ్రలో పెను విధ్వంసాన్ని సృష్టించిన హదూద్ తుఫాను పై టాలీవుడ్ అగ్రనటుడు, రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి 50 లక్షల రూపాలయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి ఉత్తరాంధ్ర ప్రజలకు అభివృద్ది కోసం తుఫాను సహాయనిధికి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత 50 ఏళ్లుగా కనీవిని ఎరుగని రీతిలో హుద్ హుద్ తుఫాను బీభత్సాన్ని సృష్టించిందని చెప్పారు. తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి, బాధితులందరినీ అదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వుందన్నారు.

తుపాను బీభత్సాన్ని కల్లారా చూసిన ప్రధాని మోడీ, తక్షణ సాయం కింద వేయి కోట్ల రూపాయలను కేటాయించడాన్ని చిరంజీవి తప్పబట్టారు. తక్షణ సాయం కింద మరో వెయ్యి కోట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి మరింత సాయం అందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. జరిగిన నష్టాన్ని చూసిన తరువాతైనా హుద్ హుద్ తుఫాను విధ్వంసాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించకపోవడం, కనీసం ప్రకటిస్తమన్న భరోసా కూడా ఇవ్వకపోవడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

Dr-K-Chiranjeevi

తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో కాంగ్రెస్ జాతీయ నేతలతో కలసి ఈ నెల 19, 20 తేదీలలో మూడు జిల్లాల్లో పర్యటిస్తానని తెలిపారు. బాధితులను ఆదుకోవడంలో మెగా ఫ్యాన్స్ ముందునిలుస్తారని చెప్పారు. మంచినీరు, ఆహారం, బిస్కెట్లు వంటివి ఇప్పటికే మెగా ఫ్యాన్స్ అందజేస్తున్నారని తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకోనే వరకు మెగా ఫ్యాన్స్ బాధితులకు అండగా నిలచి అండదండలు అందజేయాలని చిరంజీవి కోరారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles