Hike in petrol price liter rs 150 vishaka

petrol, egg, milk, tomatoes, commodities, hudhud, vishaka, groceries, prices, hike

all commodities prices goes up in hud hud effected vishaka

అక్కడ పెరిగిన పెట్రోల్ ధర.. లీటర్ రూ. 150

Posted: 10/14/2014 12:34 PM IST
Hike in petrol price liter rs 150 vishaka

కోడిగుడ్డు ఒకటెంత 15 రూపాయలు. మరి డజను 180 అదేంటి డజను తీసుకున్నా తక్కువకు ఇవ్వవా..  ఇలా బేరంసారాలు సాగుతున్నవి ఎక్కడో కాదు.. హుద్ హుద్ తుపాను పెను బీభత్సాన్ని సృష్టించిన విశాఖలో. అదేంటి ఒక్క గుడ్డు రూ.15 నా..? అనుకుంటున్నారా..? పాలు లీటర్ రూ. 80, పెట్రోల్ లీటర్ రూ. 150, టమాటో కిలో రూ. 80 ... ఇవి ప్రస్తుతం విశాఖపట్నంలో నిత్యవసర ధరల రేట్లు. హుదూద్ తుపాన్ నేపథ్యంలో విశాఖపట్నం నగరంతోపాటు మిగిలిన జిల్లాల్లో నిత్యవసర ధరలు ఆకాశాన్నంటాయి.

హుదూద్ తుపాన్తో అతలాకుతలమైన సామాన్యుడు... ఇప్పుడు నిత్యవసర వస్తువుల ధరలతో విలవిల్లాడిపోతున్నాడు. ప్రజల నుంచి డబ్బులు దండుకునే సమయం ఇదేనంటూ అమ్మకందార్లు రెచ్చిపోతున్నారు. దీంతో  నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయక తప్పని పరిస్థితి సామాన్యుడిలో నెలకొంది. నిత్యవసర ధరలు కొనుగోలు చేసేందుకు షాపుల వద్ద భారీగా ప్రజలు క్యూలో నిలబడ్డారు. అలాగే పెట్రోల్ బంకులు వాహానదారులతో కిక్కిరిపోయాయి.

తుపాను రాకూడదని లక్షల మంది అటు సముద్రుడిని, ఇటు ధేవుళ్లను ప్రార్థిస్తుంటారు. కానీ తుపాన్లు రావాలని, వచ్చినప్పుడే అధిక ధరలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయవచ్చని అమ్మకందార్లు కోరుతానడంలో అతిశయోక్తి లేదు. పైగా అమ్మకం దార్ల ప్రార్థనలే దేవుడు కూడా అలకించడం, సామాన్యుల బతుకులను ఛిద్రం చేస్తున్నాడు. మరోవైపు తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా మున్సిపల్ పంపుల్లో నీరు రాకపోవడంతో నగర ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  egg  milk  tomatoes  commodities  hudhud  vishaka  groceries  prices  hike  

Other Articles