Gaddar comments on maoists and telangana government

gaddar, gaddar songs, gaddar latest songs, gaddar folk songs, gaddar telangana songs, gaddar movements, gaddar comments, latest updates, maoists, maoism in india, telangana, telangana maoists, telangana government, power crisis in telangana, kcr, odisha, power plants, latest updates

social revolutionary activist gaddar responded on telangana government hurdle to bring power from odisha to telangana : maoists may be a reason to face risk in getting power from odisha to telangana if government agrees i will go as a peace saint for telangana saya gaddar

శాంతిదూతనౌతా ! తెలంగాణకు పవర్ తెస్తా !!

Posted: 10/13/2014 10:34 AM IST
Gaddar comments on maoists and telangana government

తెలంగాణలో ఉన్న కరెంటు కష్టాలపై ప్రజా యుద్ధనౌక గద్దర్ స్పందించారు. కరెంటు కష్టాలను తీర్చేందుకు తనవంతుగా సాయం చేస్తానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నట్లు ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ తీసుకురావటంలో ఉన్న మావోయిస్టుల సమస్యను తాను పరిష్కరిస్తానన్నారు. ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ తీసుకువచ్చేందుకు మావోయిస్టుల సమస్య ఉందన్న తెలంగాణ మంత్రుల మాటల్లో కొంత వాస్తవం ఉందన్నారు. అయితే ప్రభుత్వం అనుమతిస్తే.., తాను శాంతిదూతగా వెళ్ళి మావోలతో చర్చలు జరుపుతానని చెప్పారు. ఛత్తీస్ గఢ్ వెళ్ళి మావోలతో చర్చించి తెలంగాణకు విద్యుత్ లైను వచ్చేలా చూస్తానని ప్రకటించారు. ప్రభుత్వం కోరితే తన సాయం అందించేందుకు సిద్ధమని గద్దర్ ప్రకటించారు.

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టంలో విద్యుత్ సమస్య ఏర్పడింది. రాష్ర్టంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ అవసరాలకు సరిపడకపోవటంతో లోటు ఏర్పడి.., కోతలు విధిస్తున్నారు. ఫలితంగా పరిశ్రమ వర్గాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు ఇతర రాష్ర్టాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పొరుగున ఉన్న ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ తీసుకునేందుకు మావోయిస్టుల సమస్య ఉండటంతో ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే తనను కోరితే మావోలతో చర్చలు జరిపి విద్యుత్ తీసుకురావటంలో ఉన్న ఇబ్బందుల్ని పరిష్కరిస్తాను అని చెప్పారు.

ప్రజా గాయకుడుగా.., ప్రజా యుద్ధనౌకగా పేరు పొందిన గద్దర్ తన పాటల ద్వారా ప్రజలను చైతన్యం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన క్రియాశీలకంగా పాల్గొన్నారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ స్థాపించి పోరాటాలు చేశారు. ఆ సమయంలో టీఆర్ఎస్ తో విభేదించారు కూడా. ప్రస్తుతం రాష్ర్టం ఏర్పడిన తర్వాత వచ్చిన కరెంటు కష్టాలపై స్పందిస్తూ.., రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం అంగీకరిస్తే సాయం చేస్తానన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ కూడా రాజకీయాలను చూస్తుందా లేక సమస్య పరిష్కారం కోసం సాయం కోరుతుందా చూడాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gaddar  kcr  power  telangana  

Other Articles