Hudhud causes extensive damage to srikakulam

Cyclone Hudhud, Visakhapatnam, Bay of Bengal, Cyclone, Andhra Pradesh, farmers, crops, electric poles

Hudhud causes extensive damage to srikakulam

హుదూద్ ప్రభావం ధాటికి సిక్కొలు కాకావికళం..

Posted: 10/12/2014 03:39 PM IST
Hudhud causes extensive damage to srikakulam

గత నాలుగు రోజులుగా తీవ్ర భయాందోళనకు గురిచేసిన 'హుదుద్' పెను తుపాను అనుకున్నంత పని చేసింది. విశాఖ జిల్లా కైలాసగిరి వద్ద తీరాన్ని తాకి.. మధ్యాహ్నం పుడిమడక వద్ద తీరాన్ని దాటిన పెను తుపాను శ్రీకాకుళంలో బీభత్సాన్ని సృష్టించింది. పట్టణంలోని వివిధ కూడళ్లలో హోర్డింగులు, చెట్లు నేలకొరిగాయి. విద్యుత్, టెలిఫోన్ స్థంబాలు కూడా ఈదురుగాలులు ప్రభావానికి నేలకొరిగాయి. వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. సముద్రతీరంలోని పల్లెలు చెరువులను తలపిస్తున్నాయి.

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగిపోర్లతున్నాయి. దీనికి తోడు ఒడిశాలోని ప్రాజెక్టులు నీటి ప్రవాహంతో నిండుకోవడంతో.. అధికారులు గేట్లు ఎత్తివేశారు. దీంతో ప్రాజెక్టు నీటికి తోడు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీకాకుళం జిల్లా జలమయమైంది. పల్లెలు, పట్టణాల్లోని లోత్తట్టు ప్రాంతాలు నీటితో నిండుకున్నాయి. వరి, అరటి తోటలు నీట మునిగాయి. చేతికందే పంట నీటి పాలు కావడంతో రైతన్నలు కన్నీరుమున్నీరవుతున్నారు. తీరప్రాంతాల్లోని రోడ్డు నీటితో కొట్టుకుపోయాయి. రొడ్లు చెరువులను తలపిస్తున్నాయి. తీరంలోని బందరువానిపేట పూర్తిగా జలమయవయ్యింది. నీటి ఉద్దృతికి పలు వంతెనలు, కల్వర్టులు కొట్టకుపోయాయని సమాచారం.
Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/srikakulam

ఈదురుగాలు విపరీతంగా వీస్తుండటంతో వృక్షాలు నేలకొరిగాయి. రహదారుల భారీ సంఖ్యలో చెట్లు నేలకొరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో నాలుగు రోజుల వరకు తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో తీరప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cyclone Hudhud  Visakhapatnam  Bay of Bengal  Cyclone  Andhra Pradesh  farmers  crops  electric poles  

Other Articles