Pay power bill says apgenco

APGENCO, Telangana, Telangana government, Power, Telangana power crisis, Telangana power problems

APGENCO says pay power bill

పుండుమీద కారం చల్లుతున్న ఏపీ జెన్ కో

Posted: 10/11/2014 12:57 PM IST
Pay power bill says apgenco

ఫుండు (గాయం)పై కారం చల్లే విద్యను ఏపీ జెన్ కో ఇంకా మర్చిపోలేదు. మరో మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల పాటు నిరంతర విద్యుత్ ను అందించేందుకు సిద్దమైన సంస్థ తన పొరుగు రాష్ట్రంపై కస్సుబుస్సులాడుతోంది. విద్యుత్ బకాయిలు చెల్లిస్తారా..? లేదా అంటూ ఒంటి కాలుపై లేస్తోంది. ఇంతకీ ఆ పోరుగు రాష్ట్రం ఏదేనదేగా మీ సందేహం. అదేనండి ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి దేశంలో 29వ రాష్ట్రంగా అవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంపైనే.. ఎందుకంటారా.. మీరే దదవండీ..

అసలే తీవ్ర విద్యుత్ సంక్షోభంలో కోట్టుమిట్టాడుతూ.. సమస్య నుంచి ఎలా భయట పడాలా..? విద్యుత్ ను ఎక్కడి నుంచి కొనుగోలు చేసి ఇవ్వాలా అని తీవ్రంగా మదనపడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ జెన్ కో చర్యలు పుండు మీద కారం చల్లినట్లే వున్నాయి. జూన్ 2న రాష్ట్రం అవతరించినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకున్న విద్యుత్ బిల్లులను తక్షణం కట్టాలని పేర్కొంటూ లేఖ రాసింది. ప్రతీ నెల సర్వసాధరణంగా అందరిమాదిరిగానే బిల్లు పంపే ఏపీ జెన్కో ఈ సారి నెల బిల్లుతో పాటు లేఖను కూడా రాసింది.

గత నాలుగు నెలలుగా తెలంగాణ ప్రభుత్వం 638 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను వినియోగించుకుందని, ఇందుకు గాను బకాయిపడ్డ 1,430 కోట్ల రూపాయలను తక్షణం చెల్లించాలని పేర్కొంటూ లేఖను రాసింది. మరి లేఖను అందుకున్న తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ బకాయిలను చెల్లిస్తుందా..? లేదా..? ఈ లేఖ వ్యవహారంప ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి..

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles