Majid hussain praises kcr

kcr, kcr comments, kcr funny, kcr volgur language, kcr funny comments, kcr family, kcr latest, kcr wiki, kcr profile, telangana, hyderabad, telangana news, hyderabad news, hyderabad specialities, hyderabad tourism places, hyderabad tourism, hyderabad rank, metro police, metro police 2014, metro police 2015, metro police updates, metro police latest news, metro police summit, latest news, majid hussain, majid hussain wiki, majid hussain, majid hussain profile, majid hussain speech, majid hussain family

ghmc mayor majid hussain praises telangana chief minister kcr in metropolis 2014 summit : metro police conference started in hyderabad by telangana chief minister kcr and telangana cs rajiv sharma in the summit ghmc mayor majid hussain praises kcr

వింత ప్రకటన : హైదరాబాద్ ను టాప్ 6గా చేస్తారట

Posted: 10/07/2014 11:14 AM IST
Majid hussain praises kcr

ఎక్కువ చదివితే ఉన్న మతి పోతుంది అన్నట్లుగా.., మన నేతలకు రాజకీయ, పాలన అనుభవం పెరిగే కొద్ది విషయ పరిజ్ఞానం తక్కువ అవుతున్నట్లుంది. హైదరాబాద్ లో జరుగుతున్న మెట్రో పోలిస్ అంతర్జాతీయ సదస్సులో నగర మేయర్ మాజిద్ హుస్సేన్ ప్రకటన ఇలాగే ఉంది. నగరంలో జరుగుతున్న మెట్రో పోలిస్ సదస్సును ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అధికారికంగా ప్రారంభించారు. ఈ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన సుమారు 400మంది ప్రతినిధులు హాజరయ్యారు.

సదస్సులో ప్రసంగం చేసిన హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశంసల్లో ముంచెత్తారు. మా ముఖ్యమంత్రి మంచి విజన్ ఉన్న నేత అని గర్వంగా చెప్పారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ ను భారత దేశంలో టాప్ 6 నగరంగా నిలబెట్టాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్షగా తెలిపారు. భాగ్యనగరంను వరల్డ్ క్లాస్ నగరంగా కేసీఆర్ అభివృద్ధి చేస్తారని ధీమాగా చెప్పారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఇలా ముఖ్యమంత్రిని పొగుడుతూ పుస్తకం చదివేశారు.
అంతా బాగానే ఉంది కానీ.., హైదరాబాద్ ను టాప్ 6నగరం చేస్తామన్న ప్రకటనే విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మన నగరం దేశంలో టాప్ 6 స్థానంలో ఉంది.

ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు ఐదవ స్థానంలో ఉండేది ఇఫ్పుడు ఆరవ స్థానంకు పడిపోయింది. ప్రస్తుతం ఆరవ మహా నగరంగానే కొనసాగుతోంది. ఆరవ నగరంగా ఉన్న హైదరాబాద్ ను టాప్ 6 చేయటానికి ముఖ్యమంత్రి కష్ట పడతారు అని మేయర్ చెప్పటం ఏమిటి అని అంతా ప్రశ్నించుకుంటున్నారు. ఉన్నదాన్ని కొనసాగించటానికి కేసీఆర్, ప్రత్యేక కార్యాచరణలు కూడా కావాలా ఇదెక్కడి వింత ప్రకటన అని వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. మామూలుగా జరిగే సభలు, సమావేశాల్లో తప్పులు దొర్లాయి అంటే సరేలే అనుకోవచ్చు కాని.., అంతర్జాతీయ సదస్సుల్లో అదీ హైదరాబాద్ మేయర్ గా ఉండి భాగ్యనగరం గురించి తెలుసుకోకుండా మాజిద్ హుస్సేన్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది.

కార్తిక్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : majid hussain  metro police  kcr  hyderabad  

Other Articles