New york times apologises for racist cartoon on indias mars mission

New York Times, Apology, Racist Cartoon, Indias Mars Mission, mom

New York Times Apologises For Racist Cartoon On Indias Mars Mission

తలబిరుసు దిగింది.. క్షమాపణలు చెప్పింది..

Posted: 10/06/2014 06:44 PM IST
New york times apologises for racist cartoon on indias mars mission

హాలివుడ్ చిత్రాల నిర్మాణ ఖర్చులో కొంత వెచ్చించిన భారత్ మంగళ్ యాన్ మిషన్ ను విజయవంతంగా అరుణగ్రహ కక్షలోకి ప్రవేశపెట్టడంపై ప్రపంచ నలుమూలల నుంచి భారతీయ మేధోసంపత్తిని ప్రశంసిస్తూ కితాబులు వచ్చాయి. తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించిన దేశంగా భారత ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల జల్లు కురిపించింది. అమెరికా, రష్యా దేశాల సరసన భారత్ సుస్థిర స్థానం ఏర్పర్చుకుంది.. భారత్ శాస్త్ర సాంకేతిక రంగాలలో దూసుకుపోవడం.. మింగుడు పడని . న్యూయార్క్ టైమ్స్ అంతర్జాతీయ ఆన్ లైన్ మీడియాలో భారత్ మంగళ్ యాన్ ను చులకన చేస్తూ కార్టూన్ ప్రచురించింది.

ఎలైట్ స్సేస్ క్లబ్ అనే చోట సూట్లు ధరించిన వ్యక్తులు భారత్ మార్స్ మిషన్ గురించిన వార్తలు రాసిన పత్రికను చదువుతుండగా, పంచెకట్టు, తలపాగాతో అవును తోలుకుంటూ వచ్చిన ఓ భారతీయుడు ఆ క్లబ్ లోకి రావడానికి తలుపుతడుతున్నట్లు కార్టూన్ను ప్రచురించారు. దీనిపై సామాజిక వెబ్ సైట్లలో నిరసనలు పెల్లుబిక్కాయి. న్యూయార్క్ టైమ్స్ జాత్యహంకారంతో కార్టూన్ ను ప్రచురించిందని విమర్శించారు. ప్రాంతాలకు అతీతంగా పలు దేశస్థులు ఈ కార్టూన్పై కామెంట్ చేశారు. ఒకరు ఏదైనా మంచిపని చేస్తే దానిని ప్రశంసించాల్సిందిపోయి.. చులకన చేస్తారా..? అంటూ ప్రశ్నించారు.

దీంతో దిగివచ్చిన న్యూయార్క్ టైమ్స్ ఎడిటర్ అండ్రూ రోసెంతల్ క్షమాపణలు చెప్పారు. జాతివివక్ష పూరితంగా అనిపించేలా.. భారతీయుల్ని కించపర్చేలా కార్టూన్ ప్రచురితం అవ్వడం వల్ల తాను క్షమాపణలు చెబుతున్నానన్నారు. పంపన్న దేశాలకు మాత్రమే సాధ్యమైన రోదసి ప్రయోగాలను.. భారత్ వంటి సామాన్య దేశం కూడా అతితక్కువ ఖర్చుతో చేపడుతున్నాయని అర్థం వచ్చేలా కార్టూన్ ను ప్రచురించామని సమర్థించుకున్నారు. ఇదే తమ కార్టూన్ ముఖ్య ఉద్దేశమని అయన వివరణ ఇచ్చారు. అయితే ఈ విషక్ష్ంోల చెప్పడానికి వాడుకున్న చిత్రాలు అభ్యంతరకరంగా ఉన్నాయని అంగీకరించిన ఆయన.. ఈ కార్టూన్ వల్ల తాము భారతీయుల మనస్సును నొప్పించినందుకు క్షమాపణ చేబుతున్నామన్నారు. ఈ విసయంపై స్పందించిన పాఠకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అయితే జాత్యంహకార ధోరణిని అవలంబిస్తూ..ఇప్పటికే అనేక తప్పిదాలకు పాశ్చాత దేశాలు పాల్పడ్డాయని, అడుసు తొక్కడం, తిరిగి కడగటం వాటికి అలవాటేనని పలువురు విమర్శిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : New York Times  Apology  Racist Cartoon  Indias Mars Mission  mom  

Other Articles