World s first solar battery developed

solar battery, battery, solar cell, first solar battery, recharge, air and light, america, scientists

World's first solar battery developed, recharges itself using air and light

గాలి, కాంతి వుంటే చాలు..రీచార్జ్ దానంతట అదే అవుతోంది..

Posted: 10/06/2014 12:15 PM IST
World s first solar battery developed

విద్యుత్ తో చార్జింగ్ పెట్టకుండా.. గాలి, కాంతి వుంటే చాలు.. రీజార్జ్ దానంతట అదే అయ్యే బ్యాటరీలుంటే ఎంత బాగుండు అనుకుంటున్నారా..? అవునండీ ఇప్పడది స్వప్నం కాదు.. వాస్తవం.. ఇలాంటి కలలు గన్న ఎందోరో పరిశోధకుల స్వప్నాన్ని నిజం చేశారు అమెరికా శాస్త్రవేత్తలు. గాలి, కాంతిని ఉపయోగించుకొని రీఛార్జి చేసుకునే తొలి సౌర బ్యాటరీని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అమెరికా శాస్త్రవేత్తలు తయారుచేశారు. బ్యాటరీని, సౌర సెల్‌ను ఒకే హైబ్రిడ్ పరికరంలోకి కలిపేయడం ద్వారా ఒహియో స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు.

సౌర విద్యుత్ ఉత్పత్తి పరికరాల్లో దీర్ఘకాలంగా ఒక సమస్య ఉంది. సౌర సెల్, బాహ్య బ్యాటరీకి మధ్య ఎలక్ట్రాన్లు ప్రయాణించాల్సి వచ్చినప్పుడు విద్యుత్‌ను కొంత నష్టపోవాల్సి వస్తోంది. సౌర సెల్ నుంచి వచ్చే ఎలక్ట్రాన్లలో 80 శాతం మాత్రమే బ్యాటరీని చేరుతాయి. కొత్త డిజైన్‌లో కాంతిని బ్యాటరీలోనే ఎలక్ట్రాన్లుగా మార్చేస్తారు. ఇందులో టైటానియం గేజ్‌తో రూపొందిన సౌర ఫలకం ఉంటుంది. వాటిపై టైటానియం డైఆక్సైడ్‌తో తయారైన కడ్డీలను నిలువుగా అమర్చారు. ఈ గేజ్ గుండా గాలి ధారాళంగా ప్రవహిస్తుంది.

అదే సమయంలో కడ్డీలు సౌరకాంతిని ఒడిసిపడతాయి. ఛార్జింగ్ సమయంలో కాంతి.. సౌర ఫలక మెష్‌ను తాకి, ఎలక్ట్రాన్లను ఉత్పత్తి చేస్తుంది. బ్యాటరీ లోపల ఈ ఎలక్ట్రాన్లు లిథియం పెరాక్సైడ్‌ను లిథియం అయాన్లు, ఆక్సిజన్‌గా మార్చివేయడంలో పాత్ర పోషించాయి. ఈ లిథియం అయాన్లు.. ఎలక్ట్రాన్లను ఒడిసిపట్టాక బ్యాటరీలో లిథియం లోహం రూపంలో నిల్వ ఉంటాయి. బ్యాటరీ వినియోగం సమయంలో అది గాల్లోని ఆక్సిజన్‌ను వినియోగించుకొని, లిథియం పెరాక్సైడ్‌గా మళ్లీ మారిపోతుంది. ఇక త్వరలోనే ఈ పరిశోధన ఫలితాలు మనందరకీ అందుబాటులోకి రావాలని ఆశిద్దాం..

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : solar battery  battery  solar cell  first solar battery  recharge  air and light  america  scientists  

Other Articles