Preparations for the start of largest underground mine

Preparations, Nation's largest mine, underground mine, singareni, another record, CM kcr, coal India

Preparations for the start of Nation's largest underground mine at singareni, sets for another record

అతిపెద్ద భూగర్భగని ప్రారంభానికి సింగరేణి సన్నాహాలు

Posted: 10/02/2014 04:25 PM IST
Preparations for the start of largest underground mine

నల్ల బంగారాన్ని అంచనాలకు మించి ఉత్పత్తి చేస్తూ తెలంగాణకు మణిమకుటంలా మారిన సింగరేణి సంస్థ మరో రికార్డు సృష్టించబోతున్నది. దేశంలోనే అతిపెద్ద భూగర్భ బొగ్గు గనిని ఈ నెలలో సన్నాహాలు చేస్తున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి చంధ్రశేఖర్ రావు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు సిద్దం చేశారు. ఇందుకోసం ఇప్పటికే ట్రయల్ రన్ ను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా కంపెనీలన్నీ సులభ నిర్వహణకు సాధ్యమయ్యే ఓపెన్‌కాస్ట్ గనులను చేపడ్తుండగా, సింగరేణి మాత్రం ఏటా 2.8 మిలియన్ టన్నుల సామర్థ్యమున్న భూగర్భ గనిని మొదలుపెట్టనుంది. దేశం మొత్తం బొగ్గు కొరత ఎదుర్కొంటుంటే సింగరేణి మాత్రం దక్షిణభారతదేశ విద్యుత్ ప్లాంట్లకు తగినంత సరఫరా చేస్తున్నది. కోల్ ఇండియా దేశవ్యాప్తంగా మైనింగ్ చేపడుతుండగా, సింగరేణి తెలంగాణకు పరిమితమై ఏండ్లుగా లక్ష్యాన్ని అధిగమిస్తున్నది.

త్వరలో చేపట్టబోయే అండర్‌గ్రౌండ్ మైన్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో పది నుంచి పదిహేనుల లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే సామర్థ్యం సింగరేణి వశం కానుంది. ఈ ఏడాది సంస్థ లక్ష్యం 54.5 కాగా, మార్చి 31, 2015తో అంతమయ్యే ఆర్థిక సంవత్సరంలో 55 మిలియన్ టన్నులు, ఆ తర్వాతి ఏడాది మరో 56 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. వినియోగదారులకు ఇచ్చిన హామీ కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్న ఏకైక సంస్థ సింగరేణి కావడం విశేషం. ఇతర సంస్థల లోటును కూడా పూరిస్తూ ఎగుమతులు సరిపడేలా సాయం అందిస్తోంది. కోల్ ఇండియా ఉత్పత్తి తగ్గిపోతుండటంతో దేశంలో చాలా విద్యుత్ ప్లాంట్లు బొగ్గు కొరతతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఏప్రిల్-ఆగస్ట్ మధ్యకాలంలో 183.9 టన్నుల లక్ష్యానికి ఎనిమిది మిలియన్ టన్నులు తక్కువగా కోల్‌ఇండియా ఉత్పత్తి చేసింది. ఈ ఏడాది సంస్థ లక్ష్యమైన 408 మిలియన్ల బొగ్గు ఉత్పత్తిని అధిగమించే అవకాశాలు కనిపించడంలేదని ఆ సంస్థ ఆందోళన చెందుతున్నది.

దేశ అవసరాల్లో 80 శాతం ఉత్పత్తి చేసే కోల్ ఇండియా అవసరాలకు తగినట్టుగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటుంది సింగరేణి. ఈ భూగర్భబొగ్గు గనికి సంబంధించిన అడ్రియాలా షాఫ్ట్‌ను ప్రయోగాత్మకంగా నడిపి చూశామని సింగరేణి ఉన్నతాధికారి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన సవరించిన అంచనాలకు ఆగస్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Preparations  Nation's largest mine  underground mine  singareni  another record  CM kcr  coal India  

Other Articles