Boxer sarita refuses bronze medal

fixing, allegations, asian games 2014, boxing, bout, sarita devi, match fixing, refree

Boxer Sarita refuses bronze medal

వెల్ డన్.. బాక్సర్ సరిత.. వీ ఆర్ విత్ యు...

Posted: 10/01/2014 04:24 PM IST
Boxer sarita refuses bronze medal

ఆసియా క్రీడల్లో ఎప్పుడూ లేనంత ఉద్విగ్నత ఇవాళ కనిపించింది. సెమీఫైనల్స్లో వివాదాస్పద రీతిలో ఓడిపోయిన భారత బాక్సర్ సరితాదేవి అధికారులకు, ప్రేక్షకులకు కూడా షాకిచ్చింది. పతకాన్ని తీసుకునే క్రమంలో పోడియం వద్దకు వచ్చిన అమె.. కన్నీరు మున్నీరుగా విలపించి.. కాంస్య పతకాన్ని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి సరిత దేవికి సానుభూతి వెల్లివిరిసింది. వెల్ డన్ బాక్సర్ సరితా.. వీ ఆర్ విత్ యూ అంటూ భారతీయులు ముక్త కంఠంతో నినదిస్తున్నారు.

సెమీఫైనల్స్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కొరియా బాక్సర్ గెలిచినట్లు మ్యాచ్ లోని న్యాయనిర్ణేతలు ప్రకటించడంతో సరితాదేవి, ఆమె భర్త కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సరితపై నెగ్గినట్లు ప్రకటించిన జీనా పార్క్ ఫైనల్లో ఓడిపోయి రజత పతకం సాధించింది. వాస్తవానికి సెమీస్ బౌట్లో సరితాదేవి పూర్తి ఆధిక్యం కనబర్చింది. అయినా కూడా జీనాపార్క్ గెలిచినట్లు ప్రకటించారు. అప్పీల్ చేసినా పట్టించుకోలేదు. దాంతో పోడియం మీదకు పిలిచినప్పటినుంచి సరితాదేవి ఏడుస్తూనే ఉంది. అసలు పతకం వేసుకోడానికి కూడా నిరాకరించి.. దాన్ని రజత పతకం సాధించిన జీనా పార్క్కే ఇచ్చేసింది. ఇంతకుముందు ఆసియా, ప్రపంచ ఛాంపియన్షిప్లు కూడా గెలిచిన సరితాదేవి.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన చూసి షాకైన జీనా పార్క్.. ఏం చేయాలో తెలియక పోడియం మీదే కాంస్య పతకం వదిలేసి అక్కడి నుంచి ఆమె కూడా వెళ్లిపోయింది. దాంతో నిర్వాహకులు కాంస్యపతకాన్ని తమవద్దే ఉంచుకున్నారు.

ఒకటిన్నర సంవత్సరాల బాబును కూడా తాను వదిలిపెట్టి కఠోరమైన శిక్షణ తీసుకున్నానని, చివరకు తన కొడుకు కూడా ఒకదశలో తనను గుర్తుపట్టలేదని సరితాదేవి వాపోయింది. తనకు ఆ పతకం అక్కర్లేదు కాబట్టే దాన్ని కొరియన్లకు ఇచ్చేశానని చెప్పింది. దీని తర్వాత వచ్చే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య దక్షిణ కొరియా ఆధిపత్యంలో ఉన్నందునే ఇలా జరిగిందని అరోపణలు వెల్లువెత్తాయి. తాను సెమీఫైనల్స్ లో గెలిచినా.. రెఫరీలు కావాలనే ఒడినట్లు ప్రకటించారని తీవ్ర నిరసన తెలిపింది. సరితా దేవి, అమె భర్త తీవ్రంగా ఆక్షేపిస్తున్నా.. భారత అధికారుల నుంచి మాత్రం స్పందన కరువైంది. దొంగను దొంగ అని నిరూపించడానికి కూడా జంకుతున్న భారత బాక్సింగ్ ఫెడరేషన్ ఎందకన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి. పతకం కన్నా పరువే ముఖ్యం, అన్యాయ్యాన్ని గొంతెత్తి చాటడమే గోప్పతనమని భావించిన సరితాదేవికి భారత్ నుంచి అభిమానులు అండగా వుంటామని మనోధైర్యాన్ని ఇస్తున్నారు. అమె చేసిన పనికి భారతీయుల నుంచి అభినందనలు వెల్లివిరుస్తున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fixing  allegations  asian games 2014  boxing  bout  sarita devi  match fixing  

Other Articles