Resolution png

puducherry, assembly, resolution, statehood, adopts

puducherry assembly adopts resolution seeking statehood

తెరపైకి మరో ప్రత్యేక రాష్ట్ర తీర్మాణం..

Posted: 09/27/2014 09:52 PM IST
Resolution png


దేశంలో ముఫైయవ రాష్ట్ర అవిర్భావం కోసం కోత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. తమ ప్రాంతాన్ని ముఫైయవ రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ ను ఆక్కడి అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది. ఎక్కడ అనుకుంటున్నారా.. ఎవరు తీర్మాణం చేశారో తెలుసా..? దేశంలో అనేక ప్రాంతవాసులు తమ ప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎక్కడా అసెంబ్లీలో బిల్లు అమోదం పొందలేదు. కానీ ఇక్కడ అసెంబ్లీ తీర్మాణాన్ని చేసి కేంద్రానికి పంపింది. అదే కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి.

కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుతూ అక్కడి అసెంబ్లీ.. తీర్మానాన్ని వాయిస్ ఓటు రూపంలో ఆమోదించింది. ఈ తీర్మానాన్ని సీఎం ఎన్.రంగస్వామి ప్రవేశపెట్టారు. అయితే, రాష్ట్రంగా ప్రకటించడంతో పాటు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుతూ తీర్మానాన్ని సవరించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దీన్ని తోసిపుచ్చడంతో కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకు ముందు ప్రతిపక్ష నేత వి.వైతిలింగం మాట్లాడుతూ రాష్ట్రంగా ప్రకటిస్తే ఎన్నో సమస్యలను, అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అందుకే తీర్మానంలో ప్రత్యేక రాష్ట్ర హోదాను కూడా ఇవ్వాలనే డిమాండ్‌ను చేర్చాలన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : puducherry  assembly  resolution  statehood  adopts  

Other Articles