Tdp leader payyavula keshav compared jayalalitha assets case with ys jagan mohan reddy

tdp leader payyavula keshav, payyavula keshav press meet, payyavula keshav latest news, payyavula keshav jagan mohan reddy, ysr congress party, ysr congress party latest news, ysr congress party president ys jagan mohan reddy, jayalalitha assets case, bangalore court, jagan mohan reddy assets case

tdp leader payyavula keshav compared jayalalitha assets case with ys jagan mohan reddy

66 కోట్ల అవినీతికి జయకు 4ఏళ్ల శిక్ష.. మరి జగన్ కు?

Posted: 09/27/2014 09:44 PM IST
Tdp leader payyavula keshav compared jayalalitha assets case with ys jagan mohan reddy

1996వ సంవత్సరంలో తమిళనాడు సీఎం జయలలితపై నమోదైన అక్రమాస్తుల కేసు.. ఎన్నో విచారణల నేపథ్యంలో సాగుతూ సాగుతూ చివరికి ఒక కొలిక్కి వచ్చిన విషయం తెలిసిందే! అదికూడా రూ.66 కోట్ల అవినీతికి ఆమె పాల్పడిందని బెంగళూరు కోర్టు ఆమెను దోషిగా నిర్ధారిస్తూ నాలుగేళ్లపాటు జైలు శిక్షను విధించింది. అలాగే 100 కోట్ల జరిమానాతోపాటు ఆరేళ్లపాటు అనర్హత వేటు వేసింది. ఈ లెక్కప్రకరా... జయ రాజకీయ జీవితం ఇక్కడితోనే అంతం అయిపోయినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో వున్న ఇతర నిందితుల్ని కూడా కోర్టు జైలుశిక్షను విధించింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ వార్త గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలేమోగానీ.. ఆంధ్రరాష్ట్రంలో వున్న తెలుగుదేశం నేతలు.. జయ కేసును జగన్ తో అప్పుడే ముడిపెట్టేస్తున్నారు.

ఈ వ్యవహారంపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. జగన్ పై కొన్ని ఘాటు కామెంట్లు గుప్పించారు. జయలలితపై కోర్టు ఇచ్చిన తీర్పు జగన్ భవిష్యత్తును సూచిస్తోందని ఆయన అన్నారు. రూ.66 కోట్ల అవినీతికి జయకు నాలుగేళ్ల శిక్ష పడితే... కొన్నివేల కోట్ల రూపాయల అవినీతి కేసులో కూరుకుపోయిన జగన్ కి ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందోనని ఆయన ప్రశ్నించారు. వైకాపా అధినేత జగన్ కూడా అక్రమాస్తుల కేసులో మగ్గుతున్నారు. ఇప్పటికే ఈయన మీద కొన్నివేల కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఎన్నో ఛార్జిషీట్లు దాఖలయ్యాయి. ఇప్పటికీ సీబీఐ కోర్టు ఆ వ్యవహారంపై విచారణ కొనసాగిస్తోంది. తాజాగా జయకు కోర్టు విధించిన శిక్షలో భాగంగా పయ్యావుల కేశవ్ జగన్ మీదున్న అక్రమాస్తుల కేసును గుర్తు చేస్తూ ఇలా మాట్లాడారు. మరి దీనిపై వైకాపా నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles