Venkaiah naidu comments on telugu cinema

venkaiah naidu, venkaiah naidu latest comments, venkaiah naidu wiki, venkaiah naidu profile, venkaiah naidu comments, venkaiah naidu portfolio, central ministers, telugu cinema, telugu movies, telugu film news, movies news, telugu heros, telugu heroines, tollywood, cinema news, telugu movies latest updates, andhrapradesh, dd news, dd news telangana, dd news andhrapradesh, saptagiri channel, yadagiri channel

central minister venkaiah naidu comments on telugu cinema industry and also criticises heros, writers and others for not concentrating on ethics : telugu cinema heros not bother about ethics they just want money and hits only this is very bad says venkaiah naidu

తెలుగు సినిమాకు తెగులు పట్టింది

Posted: 09/27/2014 12:54 PM IST
Venkaiah naidu comments on telugu cinema

తెలుగు సినిమాలకు పట్టిన తెగులుపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యంగ్యస్ర్తాలు సంధించారు. ఒకప్పటి సినిమాలతో ప్రస్తుత హీరోలను పోల్చిన వెంకయ్య.., వారెక్కడ, వీరెక్కడ అంటూ విమర్శలు చేశారు. ఇండస్ర్టీలో పెరుగుతున్న కమర్షియల్ ధోరణి ప్రమాదకరమైనదిగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న సినిమాల్లో బిల్డప్ ఎక్కువని అందుకే వాటి బిజినెస్ తక్కువగా ఉంటోందన్నారు. కంటెంట్ లేకపోయినా కటౌట్లకు తక్కువ లేదు అనే విధంగా కామెంట్లు చేశారు. ఏపీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దూరదర్శన్ చానెల్.. ‘సప్తగిరి’ని రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్బంగా సినిమా పరిశ్రమపై కౌంటర్లు విసిరారు. అప్పట్లో వచ్చిన సినిమాల్లో సాహిత్య విలువలు, నటన, మంచి మాటలు, సమాజానికి పనికివచ్చే సందేశం ఖచ్చితంగా ఉండేదన్నారు. అందువల్లే ఎన్టీఆర్, నాగేశ్వర రావు, సావిత్రి వంటి నటులు ఇండస్ర్టీలో మహోన్నత స్థానాలకు చేరుకోగలిగారని చెప్పారు. ఇప్పడున్న సినిమల్లో ఇవేవి ఉండటం లేదన్నారు. కేవలం హంగామా తప్ప మరొకటి లేదని ఎద్దేవా చేశారు. ఉదాహరణకు పాత సినిమాల్లో హీరో పది దెబ్బలు కొడితే.., విలన్ కనీసం ఐదు దెబ్బలయినా కొట్టి.., చివరి వరకు పోరాడి ఓడిపోయేవాడని, ఇప్పటి సినిమాల్లో మాత్రం హీరో ఎగిరి కొడుతుంటే విలన్ చూస్తు ఊరుకుంటాడని ఎద్దేవా చేశారు.

ఇక సినిమాల్లో పెరుగుతున్న పాశ్చాత్య ధోరణి, టైటిళ్ళు ఇంగ్లీషులో ఉండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇదెక్కడి వైపరిత్యమని ప్రశ్నించారు. ఒక్కోసారి తెలుగు సినిమాను చూస్తే బాధేస్తుందన్నారు. మాతృబాషను ప్రేమించకుండా సినిమాలు తీస్తే.., ఆడవనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. తెలుగుకు ఉన్న సరళత వల్ల అద్బుతమైన మాటలు రాయవచ్చని అన్నారు. అయితే మన రచయితలు ఇదంతా వదిలేసి.. సెటైర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. రచయితలు సాహిత్యంపై మక్కువతో మాటలు రాయాలి తప్ప... సంచలనాల కోసం కాదని సూచించారు.

ఇక హీరోలు, డైరెక్టర్లు కూడా సమాజం, ప్రజలకు ఏదో మంచి చేయాలని.., మంచి మాట చెప్పాలనే ఉద్దేశ్యంతో సినిమాలు తీయాలి కానీ.., కేవలం డబ్బు, హిట్లు ఉద్దేశ్యంతో సినిమాలు తీయవద్దని కోరారు. విజ్ఙానం, వినోదం కలిపితే సినిమా అని అందులో మొదటిది వదిలేస్తే రెండవదానికి అర్ధం ఉండదన్నారు. దూరదర్శనల్ లో దేశ వ్యాప్తంగా మొత్తం 1417 ట్రాన్స్ మీటర్లు, 32 ఛానెళ్లు ఉన్నాయని ఆయన తెలిపారు. రేటింగుల వెంట పరుగెత్తకుండా, మంచి కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. ప్రజలకు వాస్తవాలు చూపించాలన్నారు.  వార్తను వార్తగా చూపించాలని చివరగా తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dd news  venkaiah naidu  tollywood  cinema  

Other Articles