Doordarshan aired manmohan as pm

doordarshan, aired, manmohan, narendra modi, Pm, commits, blunder mistake

doordarshan aired manmohan as Pm, commits another blunder mistake

దూరదర్శన్ కు ఏమైంది..? ఎందుకిలా చేస్తోంది..?

Posted: 09/27/2014 10:43 AM IST
Doordarshan aired manmohan as pm

దేశ ప్రజల ఇచ్చిన విప్లవాత్మక తీర్పుతో కేంద్రంలో తొలిసారి బీజేపి పార్టీ పూర్తి మోజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పటు చేసి నాలుగు నెలలు కావస్తోంది. ప్రధాన మంత్రి హోదాలో నరేంద్రమోడీ అగస్టు 15న ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని కూడా ఎగుర వేశారు. ఆయన ప్రసంగాన్ని కూడా లైవ్ లో చూపిన దూరదర్శన్ ఎందుకిలా చేస్తోందో అర్ధం కావడం లేదు. తప్పులపై తప్పులు చేస్తూ.. చివరకు వాటిని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.

ఇటీవల చైనా అధ్యక్షుడు మనదేశంలో పర్యటించిన సమయంలో ఆయన పేరు ముందున్న 'ఎక్స్ఐ' అనే ఆంగ్ల అక్షరాలను రోమన్‌ సంఖ్యలుగా పొరబడిన ఓ న్యూస్‌రీడర్...దానిని 'ఎలెవన్'(పదకొండు) అంటూ చదవడం సంచలనానికి కారణమైంది. ఈ నేపథ్యంలో సదరు న్యూస్ రీడర్ ఉద్యోగం కూడా పోగొట్టకున్నా.. మార్పలు మాత్రం కనబడడం లేదు. అంతేకాదు అనంతరం కనివిని ఎరుగని రీతిలో కాశ్మీరు వరదలు విలయతాండవం చేసిన సమయంలోనూ అనంత్‌నాగ్ అనడానికి బదులు ఇస్లామాబాద్ అనీ...శంకరాచార్య హిల్‌కు బదులు సులేమాన్‌హిల్ అనీ అక్కడి డీడీ కరస్పాండెంట్ పేర్కొనడమూ ఇబ్బందికర పరిస్థితికి కారణమైంది.

ఇక తాజాగా ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో ఉంటే...మరో వైపు దూరదర్శన్‌లో మోడీకి బదులు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ విజువల్స్‌ను చూపటం  చర్చనీయాంశమైంది. దీనిని అనుకోని పొరబాటుగా దూరదర్శన్ వర్గాలు పేర్కొన్నాయి. మోడీ అమెరికా పర్యటనకు సంబంధించిన వార్తాకథనాల ప్రసారంలో భాగంగా మోడీకి బదులు మన్మోహన్‌సింగ్ విజువల్ చూపారు. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నట్లు దూరదర్శన్ సీనియర్ అధికారులు తెలిపారు.

దూరదర్శన్ అనగానే మనకు నూరుశాతం విశ్వసించే ఛానెల్ గా భావిస్తాం. పోటీ ప్రపంచంలో వార్తలను ముందుగా ఇవ్వాలని ఖచ్చితమైన సమాచారానికి బదులు తమకందిన సమాచారాన్నే ముందుగా ప్రసారం చేస్తుంటాయి పలు ఛానెళ్లు. అయితే అత్యంత క్రీయాశీలక సమయాల్లో ఈ ఛానెళ్లు అందించే సమాచారాన్ని పరిగణలోకి తీసుకోని ప్రజలు దూరదర్శన్ పైనే ఆధారపడుతుంటారు. అలాంటిది దూరదర్శనే.. తప్పులు మీద తప్పులు చేస్తుంటే.. ఏమైందనుకోవాలి.? ఎవరిని విశ్వసించాలి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : doordarshan  aired  manmohan  narendra modi  Pm  commits  blunder mistake  

Other Articles