Telangana government showing neglegence on tribes killed and schemes

telangana government, kcr, telangana cm kcr news, telangana tribes killed, telangana formers suicide, telangana people, telangana political leaders, kcr government, kcr latest news, kcr press meet,

telangana government showing neglegence on tribes killed and schemes

గిరిజనుల మరణానికి కేసీఆర్ నిర్లక్ష్యమే కారణమా?

Posted: 09/26/2014 08:30 PM IST
Telangana government showing neglegence on tribes killed and schemes

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే కొన్ని కార్యక్రమాలను చకాచకా పూర్తి చేసి విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. అంతెందుకు.. ఆ పార్టీ గెలిచిందని తెలుసుకున్న తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రంలో ఘనంగా వేడుకలు కూడా జరుపుకున్నారు. కేసీఆర్ ఎన్నికల నేపథ్యంలో ప్రకటించిన హామీలను ఖచ్చితంగా పూర్తి చేస్తారంటూ ప్రజలు ఆయనమీదున్న నమ్మకాన్ని వ్యక్తపరిచారు. కొన్నాళ్లపాటు అంత సవ్యంగానే జరిగిందీ కానీ... ప్రస్తుతం ఆ పార్టీ మీద తీవ్ర విమర్శలు వెల్లువడుతున్నాయి. నిన్నమొన్నటివరకు ఎవరైతే జేజేలు కొట్టారో.. వాళ్లే ఇప్పుడు నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా తెలంగాణ ప్రభుత్వంపై ఘాటుగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

పార్టీ అధికారంలోకి వచ్చి వందరోజులు పూర్తయినా.. ఇంతవరకు పేదప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయలేదని... రైతుల రుణమాఫీ విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదని ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది తెలంగాణ రైతులు కేసీఆర్ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ.. ఆయన దిష్టిబొమ్మను దహనం కూడా చేశారు. మరోవైపు కేసీఆర్ ఇంతవరకు రుణాలను మాఫీ చేయలేదనే బెంగతో కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక తమ జీవితాలను బాగుపరుస్తాడని ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న గిరిజనుల్లో వేలమంది మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికీ కొన్నివేలమంది గిరిజనులు అనారోగ్యాలతో బాధపడుతున్నప్పటికీ.. తమ జీవన గమనాన్ని ముందుకు సాగించేందుకు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అలాగే ఎంతోమంది పేదోళ్లు కేసీఆర్ ఎప్పుడెప్పుడు సంక్షేమ పథకాలను అమలు చేస్తారా అంటూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఇక్కడ ముఖ్యంగా చర్చించుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇటీవలే ఆదిలాబాద్ లో వున్న ఆదివాసీల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చూపించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వారి చేసిన ఆ నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు అక్కడ వేలాదిమంది గిరిజనులు మృత్యువాత పడుతున్నారని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వం అటువంటివారి మీద దృష్టి సారించకుండా... అనవసరమైన పనుల కోసం ఖర్చులు పెడుతోందని రాజకీయ విశ్లేషకులతోపాటు తెలంగాణ ప్రజలు కూడా మండి పడుతున్నారు. పోలీసుశాఖ మార్పుకోసం, క్రీడాకారులకు బహుమానాలు ఇవ్వడం(ముఖ్యంగా సానియా మీర్జాకు కోట్లు ధారబోయడం), ఉద్యోగస్తులకు పండుగ సందర్భంగా బోనస్ లు ఇవ్వడం ఇంకా ఇతర వ్యవహారాలపై ప్రభుత్వం ఇప్పటికే ఎంతో ఖర్చు పెట్టిందని వారు పేర్కొంటున్నారు. ఒకవైపు రైతులు, గిరిజనులు మృత్యువాతలు పడుతుంటే.. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అనవసరంగా ఖర్చులు పెట్టడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నిస్తున్నారు.

మొత్తానికి ఇక్కడ విశ్లేషకులతోపాటు తెలంగాణ ప్రజలే కేసీఆర్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని... ప్రజాధనాన్ని అనవసరంగా ఖర్చులు చేయడమేకాకుండా, సంక్షేమ పథకాల నిర్వహణలో ఆలస్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. కేసీఆర్ ఇంతవరకు తీసుకున్న నిర్ణయాలు, చెప్పిన పథకాలు బాగానే వున్నాయి గానీ.. వాటిని పేదప్రజల వరకు త్వరగా అందచేస్తే ఇంకా బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు. మరి ఈ విషయంపై కేసీఆర్ ఎలా స్పందించనున్నారో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  telangana tribes killed  telangana police department  bathukamma festival  

Other Articles