100 new political parties registed in just four months

key Election commission, CEC, notified parties, list, janasena, India, 100 political Parties

Election commission declares notified parties list, up tops the list by 31 new parties

రాజకీయ ‘భారతం’.. 4 నెలల్లో.. 106 పార్టీలా..

Posted: 09/25/2014 12:14 PM IST
100 new political parties registed in just four months

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసి నాలుగు నెలల కాలేదు.. అప్పుడే వందకు పైగా కొత్త రాజకీయ పార్టీలు పుట్టకోచ్చాయి. అంతే కాదండోయ్.. అవన్నీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద కూడా తమ పార్టీలను నమోదు చేసుకున్నాయి. నమ్మలేక పోతున్నారు కదూ.. నిజమండీ. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన జాబితా ప్రకారం ప్రస్తుతం దేశంలో 1,699 పార్టీలు వున్నాయి. అదే సార్వత్రిక ఎన్నికలకు ముందు 1593 పార్టీలు వున్నాయి. అంటే కేవలం నాలుగు మాసాల వ్యవధిలోనే 106 కొత్త పార్టీలు పుట్టుకోచ్చాయి.

కొత్తగా రిజిస్టరైన రాజకీయ పార్టీల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 31 ఏర్పాటయ్యాయి. ఆ అక్టోబర్ 15న అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న మహారాష్ట్ర, హర్యానలలో అత్యధికంగా కొత్త రాజకీయ పార్టీలు నమోదయ్యాయి. హర్యానాలో 14, మహారాష్ట్ర 13 కొత్త పార్టీలు ఏర్పడ్డాయి. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో 9 రాజకీయ పార్టీలు ఏర్పాటయ్యాయి. అయితే ఇవన్నీ ఎన్నికలకు ముందు దరఖాస్తు చేసుకున్న పార్టీలే. రాష్ట్రం విడిపోక ముందు దరఖాస్తు చేసుకున్న పార్టీలన్నింటినీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన పార్టీలుగానే ఎన్నికల సంఘం పరిగణించింది.

జాతీయ గుర్తింపు పొందినవి ఆరు మాత్రమే..

గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆరు పార్టీలకు మాత్రమే జాతీయ పార్టీల గుర్తింపు దక్కింది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ, సీపీఎం, సీపీఐ, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలకు మాత్రమే జాతీయ పార్టీలుగా కేంధ్ర ఎన్నికల సంఘం గుర్తింపునిచ్చింది. అలాగే రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాను కూడా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆయా రాష్ట్రాల్లో గుర్తింపు సాధించిన రాజకీయ పార్టీలు 54 మేర ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైసీపీ పార్టీ గుర్తింపు పొందగా,  తెలంగాణలో ఏఐఎంఐఎం, బీహార్‌లో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, సిక్కింలో సిక్కిం క్రాంతి మోర్చా, కేరళలో రెవెల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, త్రిపురలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు పొందాయి. జాతీయ, రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు పొందినవి మినహాయిస్తే 16 వందల పైచిలుకు పార్టీలు కేవలం ఎన్నికల సంఘం వద్ద రిజస్టరైన పార్టీలుగానే ఉన్నాయి

 జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Election commission  CEC  notified parties  list  janasena  India  100 political Parties  

Other Articles