Actor sivaji hopes for ttd chairman post

sivaji, sivaji movies, telugu movies, tollywood, latest news, andhrajyoti, latest updates, ttd, tirupati, tirumala, andhrapradesh, nizamabad, suicide

telugu actor sivaji tried to attempt suicide but he only resolved his problem and came back to home : sivaji hopes that he will get ttd chairman post

టీటీడీ చైర్మన్ పదవిపై కన్నేసిన హీరో శివాజి

Posted: 09/22/2014 10:41 AM IST
Actor sivaji hopes for ttd chairman post

సినిమాల్లో ఉండేవారికి ఎప్పుడూ సినిమాల పిచ్చి అని అంతా అనుకుంటారు. కాని సినిమా వ్యక్తులకు కూడా సమాజం పట్ల బాధ్యత ఉంటుందని మన శివాజి నిరూపించాడు. ఏడేళ్ళుగా కెరీర్ లో హిట్ లేకపోయినా.., తట్టుకుని జీవించాడు. ఇప్పుడు బూచాడమ్మా, బూచాడు సినిమాకు మంచి టాక్ వస్తోంది. ఈ సందర్బంగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో శివాజి తన అనుభవవాలు పంచుకున్నాడు. సినిమా పట్ల ఆయనకున్న పిచ్చి ఏమిటో చెప్పాడు. తన సినిమాలు ఆడకపోతే కలిగే బాధేమిటో కూడా వివరించాడు. ఇలా బాధను భరించలేకే ఓ సారి సూసైడ్ చేసుకుందామని ఇంటినుంచి బయటకు వెళ్లాడట. అయితే మళ్ళీ మనసు మార్చుకుని వెనక్కి వచ్చేశాడు.

ఆత్మహత్యల వల్ల సమస్యలు పరిష్కారం కావని తెలిసి కూడా కొన్ని బలహీన క్షణాలు మనిషిని ఆ దిశగా తీసుకెళ్తాయని... అప్పుడే మనస్సు పెట్టి ఆలోచిస్తే ధైర్యం వస్తుందని చెప్పాడు. సినిమా ఆడదు అనుకుని చనిపోయేందుకు బయటకు వెళ్ళిన తాను, తిరిగి సినిమా ఆడుతుంది అనే నమ్మకంతో ఇంటికి వచ్చేశాడు. ఇక సామాజిక కార్యక్రమాలు, సంఘసేవా పనుల్లో ఇంకా చెప్పాలంటే రాజకీయ పార్టీల సభల్లో కూడా అప్పుడప్పుడూ కన్పించే ఈ బూచాడికి సొసైటిని మార్చాలని లోపల తెగ కసి ఉంది. ఏదో చేయాలని తపన కూడా ఉంది. కానీ రాజకీయాల్లోకి రానని అదే సమయంలో ఎమ్మెల్యేను కూడా కాబోనని ప్రకటించాడు. అయితే కాలంతో పాటు మనిషి మారతాడన్నట్లు ఏం జరుగుతుందో చూడాలి మరి.

అటు తనకున్న కోరికను కూడా శివాజీ బయట పెట్టేశాడు. ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి కావాలని ఉందట. అయితే అందరూ అనుకుంటున్నట్లు ఆధిపత్యం కోసమో లేక.., పేరుకోసమో కాదు ప్రక్షాళన కోసమని చెప్తున్నాడు. దీనికి సంబంధించి శివాజి స్వయంగా అన్నా మాటలు ’’చిన్నప్పటి నుంచి తిరుపతికి వెళుతున్నాను. వెంకటేశ్వరస్వామి మా ఇలవేల్పు. తిరుపతికి వెళ్తే స్నానం చేయడానికి నీళ్లు ఉండవు. కోనేటిలో స్నానం చేస్తే ఏం రోగాలొస్తాయోనని భయమేస్తోంది. అలాంటి పరిస్థితి ఉంది. భగవంతుడికి లక్షల కోట్లు ఆస్తులున్నాయి. అభివృద్ధి చేయడానికి ఏం ఇబ్బంది? ఆ ఆలోచన ఎందుకు ఉండదు? ఇలాంటి అంశాలన్నీ బాధ కలిగిస్తాయి. పాలెం ఘటనలో కూడా అదే జరిగింది. దేవుడు నా చేతే అడిగిస్తున్నాడేమో అనుకుంటాను. ఎప్పటికైనా నాకు టీటీడీ ఛైర్మన్‌ కావాలని కోరిక ఉంది? అవుతాను’’ అని ధీమాగా ఉన్నాడు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sivaji  suicide  ttd chairman  latest news  

Other Articles