Telangana cm kcr speech in latest press meet about state development

telangana cm kcr, kcr latest news, kcr latest press meet, kcr press meet, kcr telangana state, telangana state development, telangana state government, telangana news, telangana cm kcr news

telangana cm kcr speech in latest press meet about state development

అభివృద్ధి పనుల్లో తెలంగాణాకు షాకిచ్చిన కేసీఆర్

Posted: 09/19/2014 08:05 PM IST
Telangana cm kcr speech in latest press meet about state development

(Image source from: telangana cm kcr speech in latest press meet about state development)

తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన కేసీఆర్... ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాన్ని, హైదరాబాద్ సిటీని ప్రపంచంలో చెప్పుకోదగ్గ విధంగా అభివృద్ధి చేస్తామని హామీలిచ్చారు. అలాగే రైతులకు రుణమాఫీ, దళితులకోసం భూములు, పేదలకు సంక్షేమ పథకాలు.. ఇలా రకరకాల పథకాలను అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే ఆయన సీఎం అయిన అనంతరం కొన్ని కార్యక్రమాలను వేగవంతం చేశారు కానీ మరికొన్నింటిలో మాత్రం వెనుకుండిపోయారని తెలుస్తోంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ మీద ఆయన ఇంతవరకు క్లారిటీ కాదు కదా.. ఆ విషయంపై నోరు కూడా మెదపడం లేదు. దీంతో ఆగ్రహానికి గురైన వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం నిరసనలు కూడా చేశారు. ఇక కరెంట్ కోతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో చేతులు ఎత్తేసింది. మరో మూడేళ్లవరకు కరెంట్ సమస్యలు తప్పవని ముందే ప్రకటించేసింది. సంక్షేమ పథకాలు త్వరలోనే అమలవుతాయని ప్రకటించారు కానీ.. వాటికి సంబంధించి ఇంకా చర్చలు కొనసాగుతూనే వున్నాయి.

ఇదిలావుండగా.. తాజాగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాభివృద్ధి మీద కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పూర్తిగా వెనకబడిపోయిందని.. అందుకే అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడానికి వీలుగా లేవని వ్యాఖ్యానించారు. 14వ ఆర్థిక సంఘంలో పాల్గొన్న కేసీఆర్... అభివృద్ధి కార్యకలాపాలపై మరికొన్ని కామెంట్లు చేశారు. మహబూబ్ నగర్, ఖమ్మం వంటి జిల్లాలతో మరికొన్ని జిల్లాలు మరింత వెనుకబాటులో వున్నాయని పేర్కొన్న ఆయన... మరో ఐదేళ్లపాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ పేర్కొన్న ఈ వ్యాఖ్యలపై అప్పుడే ప్రత్యర్థ నాయకులతోపాటు రాజకీయ విశ్లేషకులు కూడా సెటైర్లు వేస్తున్నారు. మరో ఐదేళ్లవరకు తెలంగాణ అభివృద్ధి చెందదని.. అంతవరకు ప్రజలు సమస్యలతో మగ్గుతూనే వుండాలంటూ వారు చెబుతున్నారు. ఎన్నికల ముందు తన మాయమాటలతో కేసీఆర్ మభ్యపెట్టి.. ఇప్పుడు మోసం చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.

మరోవైపు.. ఈ సమావేశంలోనే కేసీఆర్ మరికొన్ని హామీలను పూర్తి చేస్తానంటూ ప్రజల ముందుంచారు. దళితులకు 3 ఎకరాల భూపంపినీ కార్యక్రమం తమ ప్రభుత్వం ప్రారంభించినట్లు వెల్లడించారు. విద్యుత్ కోతలను అధిగమించేందుకు చర్యలు కూడా చేపట్టామని పేర్కొన్నారు. ఇంటింటికీ తాగునీరు అందించేందుకు సమగ్ర ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్ దే సింహభాగం వుందని పేర్కొన్న ఆయన.. ఆ ఆదాయంతో పేదలకు సంక్షేమ పథకాలను చేపట్టే ఆలోచనలో వున్నట్టు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైందని చెప్పిన ఆయన.. సర్వే వల్ల అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేరే అవకాశముందని అన్నారు. వెనుకబడిన ప్రాంతాలకోసం ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసిన ఆయన.. నిధులకోసం కేంద్రానికి ప్రతిపాదించాలని ఆర్థిక సంఘాన్ని కోరారు. ఈ ఆర్థిక సంఘంలో కేసీఆర్ తో పాటు మంత్రి ఈటెల రాజేందర్, పలువురు ఉన్నతాధికారులు కూడా సమావేశమయ్యారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana state  kcr  state development  etela rajendar  

Other Articles