Case on jc prabhakar reddy withdrawn by bank officer

bank officer, tadipatri, anantapuram, faction, mla, prabhakar reddy, jc prabhakar reddy, diwakar reddy, jc brothers, latest news, prabhakar bank officer case, andhrapradesh

tadipatri sbi bank officer withdrawn case against mla jc prabhakar reddy : with tensions and protests against bank officer in tadipatri finally she withdrawns case against mla prabhakar reddy

చెత్త కేసు కంచికి... జేసి ఇంటికి

Posted: 09/16/2014 06:29 PM IST
Case on jc prabhakar reddy withdrawn by bank officer

తాడిపత్రిలో మంగళవారం ఉద్రిక్త వాతావరణాలు చోటుచేసుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యేపై సోమవారం రాత్రి పోలిసులు కేసు పెట్టగా.., ఉదయం నుంచి పట్ణణం అట్టుడికిపోయింది. ఎమ్మెల్యేపై కేసు కొట్టేయాలని పోలిస్ స్టేషన్ ఎదుట ఆయన అనుచరులు, అభిమానులు ధర్నాకు దిగారు. అటు ఫిర్యాదు చేసిన స్టేట్ బ్యాంకు అధికారిణిని అయితే ముచ్చెమటలు పట్టించారు. ఆమెకు వ్యతిరేకంగా బ్యాంకు ఎదుట నానా హంగామా చేశారు దీంతో ఉద్రిక్త పరిస్థితుల మద్య కంప్లయింట్ వెనక్కి తీసుకుంటున్నట్లు బ్యాంకు ఆఫీసర్ ప్రకటించింది. దీంతో ఆందోళనలు తగ్గిపోయి.., సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి.

చెత్త కారణం

ఇంతటి వివాదానికి ఉద్రిక్తతలకు కారణం అయింది చెత్త. క్రితం తాడిపత్రిలోని స్టేట్ బ్యాంక్ ఏటీఎం వద్ద చెత్త ఎక్కువగా పడి ఉండడం చూసిన ప్రభాకర్ రెడ్డికి ఆగ్రహం వచ్చింది. ఏటీఎంకు తాళాలు వేసుకుని ఇంటికెళ్లారు. విషయం తెలిసిన ఎస్ బీ ఐ చీఫ్ మేనేజర్ సుప్రజ సిబ్బందితో కలిసి తాళం తీసుకోవడానికి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లగా బ్యాంకు సిబ్బందిపై ఎమ్మెల్యే మండిపడ్డారు. చెత్త ఉండటం చూసి చిత్తుచిత్తుగా తిట్టారని తెలుస్తోంది. జేసీ తిట్లతో అధికారులు మనస్తాపం చెందారు. అయితే తమను దూషించటం పట్ల కోపంతో చీఫ్ మేనేజర్ సుప్రజ డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎమ్మల్యేపై ఫిర్యాదు చేశారు. అయితే జేసీ బ్యాగ్రౌండ్ తెలిసిన పోలిసులు వెంటనే కేసు పెట్టలేదు. ఎందుకు రచ్చ అని చెప్పి చూశారు. అయినా సరే సుప్రజ వినకపోవటంతో చేసేది లేక కేసు పెట్టి కూర్చున్నారంతే.

చెత్తను ప్రశ్నించినందుకు జేసీపై కేసు పెట్టారన్న విషయం తెలుసుకున్న అనుచరులు ఆగ్రహంతో ఉదయం నుంచే ఎస్ బీ ఐ బ్యాంకులను ముట్టడించేందుకు వ్యూహం సిద్దం చేసుకున్నారు. పరిస్థితిని గ్రహించిన పోలిసులు.., అదనపు బలగాలను రప్పించారు. అయితే అనుచరులు మాత్రం ఆగలేదు. బ్యాంకు, ఏటియం, పోలిస్ స్టేషన్ వద్ద ధర్నాలతో హోరెత్తించారు. చెత్త తరలించి.., శుభ్రంగా ఉంచమని చెప్తే కేసు పెడతారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో పరిస్థితికి కారణం అయిన బ్యాంకు అధికారిణి సుప్రజతో మాట్లాడిన పోలిసులు కేసును ఉపసంహరించుకునేలా చేశారు.

అటు విషయం బ్యాంకు ఉన్నతాధికారులకు కూడా తెలిసి.., ఎందుకొచ్చిన గొడవ అని వారు కూడా సూచించారు. దీంతో సుప్రజ కంప్లయింట్ వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలిసుల తీరుపై ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లీసుల వైఖరి తనపై కక్ష కట్టినట్లు అనిపిస్తోందన్నారు. పోలీసుల ప్రవర్తనపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తాడిపత్రి పరిశుభ్రత, అభివృద్ధి విషయంలో రాజీపడేది లేదన్న జేసీ, కోట్ల రూపాయల సొంత నిధులు వెచ్చించి తాడిపత్రిని అభివృద్ధిలోకి తెచ్చానని చెప్పారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jc prabhakar reddy  sbi bank  police case  latest news  

Other Articles