Andhrapradesh government completes 100days

andhrarpadesh, andharapradesh government, chandrababu naidu, tdp, chandrababu cabinet, ap cabinet ministers, ap assembly, ap capital, vijayawada, telangana, hyderabad, 100days, century, latest news

chandrababu's government completes first 100days successfully : andhrapradesh government completes century days of ruling

బాబు శతదిన విశేషాలు

Posted: 09/16/2014 10:19 AM IST
Andhrapradesh government completes 100days

ఏపీ ప్రభుత్వం వందరోజులు పూర్తి చేసుకుంది. ఎన్నో అడ్డంకులు మరెన్నో అవాంతరాల మద్య శతదిన పాలన పూర్తి చేసుకున్న ఏపీ సర్కారు కొత్త ఆశలతో ముందుకెళ్తోంది. విభజన తర్వాత మిగలిన రాష్ర్ట పగ్గాలను చేపట్టిన చంద్రబాబు తన మార్కు పరిపాలన సాగిస్తున్నారు. మూడు నెలల పాలనలో చంద్రబాబు చేసిందేమిటనే అంశంపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వం పెద్దగా చేసిందేమి లేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇప్పటివరకు ప్రజలకు హామిలు ఇవ్వటం తప్ప అమలు లేదని వేలెత్తి చూపుతున్నాయి. చంద్రదండు ఏమి చేయలేదా.. ఒకవేళ చేయకపోతే అందుకు గల కారణాలు ఏమిటి..?

చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి పరిస్థితులన్ని మారిపోయాయి. రాష్ర్ట విభజన జరిగి 23 జిల్లాల ఏపీ, 13 జిల్లాలతో మిగిలింది. బాబు ప్రమాణం చేసే సమాయానికి ముందే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటవగా.., ఏపీలో రాష్ర్టపతి పాలన కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు అధికారాన్ని చేపట్టారు. తమ మనోభావాలకు వ్యతిరేకంగా విభజన జరిగిందని ఆవేదనలో ఉన్న ప్రజలు సరైన మార్గదర్శి చంద్రబాబే అని నమ్మి అధికారం అప్పగించారు. ఈ విషయాన్ని గుర్తుంచుకున్న బాబు.. అందుకు తగ్గట్లే అడుగులు వేసుకుంటూ వస్తున్నారు. విభజనతో నష్టపోయన ఏపీ ప్రజలకు అభివృద్ది చేస్తానని భరోసా ఇచ్చారు.

విడిపోయిన సమంయలో జరిగిన పంపకాల ప్రకారం.., తెలంగాణ రాష్ర్టం రూ.300కోట్ల మిగులు కలిగి ఉండగా., ఏపీ మాత్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఆస్తుల-అప్పుల పంపిణి జరిగా జరగలేదని చెప్పేలోపు పంపకాలు పూర్తయ్యాయి. దీంతో అప్పుల ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టినా., అధైర్య పడకుండా పరిస్థితులు చక్కదిద్దటంపై దృష్టిపెట్టాడు. లోటును భర్తీ చేసుకునేందుకు కేంద్రం సాయం చేయాలని కోరగా.., అందుకు మోడి కూడా అంగీకరించారు. దీంతో కాస్త ఊరట చెంది ఏపీప్రభుత్వం ఇక పాలనపై దృష్టిపెట్టింది. మంత్రులకు శాఖలు కేటాయించి పరిపాలనను వేగవంతం చేశారు. గతంలో మద్రాసు నుంచి విడిపోయిన సమయంలో గుడారాల్లో సచివాలయం ఏర్పాటు చేసుకోగా.., ప్రస్తుతం మాత్రం కేంద్రం కల్పించిన కేటాయింపులతో హైదరాబాద్ లో ప్రత్యేక కార్యాలయాల్లో పరిపాలన ప్రారంభించారు.

అప్పులున్న ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అగ్రగామిగా చేస్తానని ప్రజలకు హామి ఇచ్చారు. అదేవిధంగా ఉద్యోగులెవరూ అధైర్యపడవద్దనీ.., కష్టపడి పనిచేయాలని సూచించారు. ఏపీని అందరం కలిసి నిర్మించుకుందామని చెప్పారు. రాష్ర్ట అభివృద్ధి, రాజధాని నిర్మాణం కోసం విరాళాలు అందజేయాలని కోరారు. ఇదే సమయంలో విభజన కష్టాలు మొదలయ్యాయి. ఏ అంశం జోలికెళ్ళినా ఏదో ఒక వివాదం వచ్చిపడేది. కరెంటు కేటాయింపు, బొగ్గు కేటాయింపు, నీటి పంపకాలు ఇలా ప్రతి అంశంలో సోదర రాష్ర్టంతో తగువులే మిగిలాయి. స్వార్ధప్రయోజనాల కోసం విభజన చేసి తెలుగువారి మద్య యూపీఏ నిత్యం కొట్లాటలు పెట్టిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు మద్యే మార్గంగా కేసీఆర్ తో చర్చలు జరుపుకుని పలు వివాదాలను పరిష్కరించుకున్నారు.

అయినా సరే ఇబ్బందులు మాత్రం తప్పటంలేదు. స్థానికత, ఫీజు రిఎంబర్స్ మెంట్, ఉద్యోగుల, ఉన్నతాధికారుల విభజన ఇలా ఏదో ఒక రూపంలో విభజన కష్టం వచ్చి పడుతూనే ఉంది. వీటన్నిటిని పరిష్కరించకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టారు. ముఖ్యమైన రుణమాఫిపై రిజర్వు బ్యాంకు నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫి అమలు చేసి తీరుతానన్నారు. వీటితో పాటు ఇతర అంశాలైన ఎన్టీఆర్ సుజల స్రవంతి, వృద్ధులు, వితంతువులకు పెన్షన్ పెంపు, ఫీజు రి ఎంబర్స్ మెంట్ కొనసాగింపు సహా ఇతర హామిలను ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. వీటిలో కొన్నిటిని త్వరలో అమలు పర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.

ఇక విభజన ప్రక్రియలో ముఖ్యమైన ఏపీ రాజధానిపై నిర్ణయం తీసుకున్నారు. శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ పరిసరాలు వద్దని చెప్పగా.. ఏపీ ప్రభుత్వ కమిటీ చెప్పిన విజయవాడ ప్రాంతాన్నే రాజధానిగా ప్రకటించారు. దీనిపై కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. బాబు రాజకీయ ప్రయోజనం కోసం బెజవాడను వదలటం లేదని ఆరోపణలు వచ్చాయి. అటు సీమ ప్రజలు కూడా తమ ప్రాంతంలో రాజధాని ఉండాలని పట్టుబడుతున్నారు. అయినా సరే తన పట్టు వీడటం లేదు. రాష్ఱ్టంలో 3మెగాసిటీలు, 14 స్మార్ట్ సిటీలను నిర్మిస్తామని.., ఏపీలో సర్వోతముఖాభివృద్ధి సాధిస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో రాధాని నిర్మాణంపై ప్రాధమిక పనులు జరుగుతుండగా.., తాత్కలికంగా రాజధాని తరలించేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి.

విభజన సమస్యలు, పక్క రాష్ర్టంతో ఇబ్బందులు, ప్రజలకు ఇచ్చిన హా్మీలు, ప్రతి పక్షాల విమర్శలు ఇలా అన్నిటినీ బేరీజు వేసుకుంటూ ఏపీ ప్రభుత్వ పాలన కొనసాగుతోంది. వంద రోజుల్లో ఇచ్చిన హామీలు అన్ని అమలు జరగకపోవచ్చు. కానీ వాటి అమలుపై మాత్రం ప్రజలకు కాస్త నమ్మకం ఏర్పడింది. బాబు చేయగలరు అనే విశ్వాసం వారికి వచ్చింది. మూడు నెలలు సమీక్షలు సమావేశాలకే పరిమితం అయ్యారు. అంతమాత్రాన ఏమి చేయలేదన్నట్లు కాదు. హామిల అమలుపై చర్చించారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశారు. ఏపీ అభివృద్ధిపై మార్గదర్శకాలు రూపొందించారు. ఇలా చంద్రబాబు వంద రోజుల పాలన కొనసాగించారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  100days  andhrapradesh government  latest news  

Other Articles