Death toll climbs in flood hit india and pakistan

jammu, kashmir, floods, india, pakistan, rescue operations, Army, omer abdullah, nawaz Sharif

Death toll climbs to over 500 in flood-hit India and Pakistan

కల్లోల కాశ్మీరం.. క‘న్నీటి’ గాధలు

Posted: 09/15/2014 03:11 PM IST
Death toll climbs in flood hit india and pakistan

అందరు గాఢ నిద్రలో వున్నారు. అ నిశబ్దంలోంచి తమకు దగ్గరలోని ఓ మసీదు నుంచి హోరున మ్రోగింది మైకు.. నమాజు చేసే సమయం కాదు.. ఇప్పడేందుకు మ్రోగింది మైకు అంటూ నిద్రలో వున్న అరవై ఏళ్ల నజీబ్ అటు వైపు ద్యాస నిలిపింది. వరద నీరు వచ్చేసింది.. అప్రమత్తంగా వుండండి.. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లండి అంటూ మసీదు మైకులోంచి హెచ్చరికలు ఆమెకు నిద్రావస్థలో వుండగానే కలవరపెట్టాయి. అంతే మరుక్షణంలో తేరుకుని, తన భర్తతో పాటు ఇతరులను కూడా లేపింది. ఇంతలో తమ ఇంటి మెయిన్ గేట్ను ఎవరో తోసివేసినట్టు శబ్దం. తీరా చూస్తు అప్పటికే తమ గెట్లను తెరుచుని ఇంటిలోకి చేరుతున్న నీరు.. క్షణక్షణానికి పెరుగుతూనే వుంది. నీటీని బయటకు పంపుదామనుకున్న ఆమె నీటి ఉధృతిని పెరగడాన్ని గమనించింది. అంతలోనే తమ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ నిండా నీరు చేరింది. వెనువెంటనే మెదటి అంతస్థు నీటిలో మునిగింది. దీంతో రెండో ఫ్లోర్ లోకి వెళ్లి నజీబ్ దంపతులు తలదాచుకున్నారు. వీరిద్దరినీ సహాయక బృందాలు రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించాయి. దీంతో తాము అదృష్ట వంతులమని భావించారు వారిద్దరు. తమ అదృష్టం కొద్ది నీరు రెండో ఫ్లోర్ స్థాయిలో ప్రవహించలేదని, అదే జరిగి వుంటే ఈ క’న్నీటి’ వ్యధను చెప్పేందుకు తాము ప్రాణాలతో వుండేవారము కాదని అమె పేర్కొంది. ఇలా జమ్మూలో వరద ప్రభావిత ప్రాంతాల నుంచి బయట పడిన ప్రతీ ఒక్కరికి తమ కళ్ల వెనుకన ఏదో ఒక కన్నీటి గాధ దాగివుంది.

ఇదివరకు ఎప్పుడు కనీవిని ఎరుగని రీతిలో జమ్మూకాశ్మీర్ లో ప్రకృతి ప్రకోపాన్ని చూపింది. ఇటు భారత్, అటు పాకిస్థాన్లలోని జమ్మూకాశ్మీర్ ప్రజల జీవితాలను ఛిద్రం చేసింది. వరదల ధాటికి ఇరు దేశాల్లో మొత్తం సుమారు 500 మందికి పైగా అసువులు బాసారు. పాకిస్థాన్లో మూడు వందల మంది, భారత్ లో రెండు వందల మంది మరణించినట్లు ఆయా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య మఃరింత పెరిగే అవకాశం వుందని పలువురు వాటెంటీర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తమ టీమ్ సభ్యులు శ్రీనగర్లో అనేక మంది మృతదేహాలు తేలుతుండడాన్ని గమనించారన్నారు.

సాయుధ బలగాలకు చెందిన 80 వైద్య సహాయక బృందాలు నిరంతరం సేవలందిస్తున్నాయి. ఆదివారం ఉదయం వర్షాలు కురవడంతో సహాయక చర్చలకు కాసేపు ఆటంకం ఏర్పడింది. ఇప్పటివరకు సాయుధ బలగాలు, జాతీయ విపత్తు స్పందనా దళం రెండు లక్షల మందిని కాపాడాయి. ఇంకా లక్షకు పైగా వరద ప్రాంతాల్లోనే ఉన్నారు. వరదల వలయంలో చిక్కుకుని వారం రోజుల కావస్తున్న తమకు సాయం చేసే వారు కరువవ్వడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను వదిలేసి బయటివారిని, ప్రముఖులను మాత్రమే రక్షిస్తున్నారన్న స్థానికుల నినాదాలు చేశారు. తమను ఏ ఒక్క రాజకీయ వేత్త పట్టించుకోలేదని వాపోయారు. పునరావస కేంద్రాల్లో వున్న తమను ఎందుకు పట్టించుకోవడం లేదని వారు ప్రశ్నించారు. పునారావాస కేంద్రాల వద్ద కూడా సహాయ చర్యల్లో నిమగ్నవమైన అధికారులకు, బాధితులకు మధ్య పలుమార్లు ఘర్షణాత్మక వాతావరణం నెలకొందని సమాచారం. వరదల నేపథ్యంలో సహాయక చర్యలను అందించడంలో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం విఫలమైందని అనేక మంది విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలను జమ్మూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతినింది. అది అపోహా అని చెప్పారు.

ఔషధాలు, వైద్య సిబ్బందిని ప్రభావిత ప్రాంతాలకు, సహాయ శిభిరాలకు తరలించారు. ఢిల్లీ నుంచి దాదాపు పది టన్నుల ఔషధాలు, ఇతర ఆరోగ్య సంబంధిత వస్తువులను పంపించారు. మరోవైపు బాధితులకు పంపిణీ చేసే నిత్యవసరాలను రెట్టింపు చేసి సరఫరా చేయాలని అధికారులను ఒమర్ ఆదేశించారు. మరోవైపు పారిశుద్ధ్య కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని రాష్ట్ర మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. నీటి శుద్ధి కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.. వరదలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ.5700 కోట్ల వరకు నష్టం జరిగిందని అసోచామ్ అంచనా వేసింది.

మతం గోడలను కూల్చేసిన వరదలు: వరదల బీభత్సానికి చెల్లాచెదురైన ప్రజలు గురుద్వారా, మసీదులు, ఆలయాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఈ పునరావాస కేంద్రాలు మత హద్దుల్ని చెరిపేశాయి. ఓ గురుద్వారాలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో హిందువులు, ముస్లింలు, సిక్కులతో కలిపి 2000మంది ఆశ్రయం పొందుతున్నారు. దానికి సమీపంలోనే ఉన్న ఓ మసీదులో 500కుటుంబాలు తలదాచుకుంటున్నాయి.

బాధితులను ఆదుకుని సాయం చేసిన పాకిస్థాన్ ఆర్మీ
కాశ్మీర్ లో కుండపోత వర్షంతో వచ్చిన వరదల ధాటికి సుమారు 20 లక్షల మందిపై ప్రభావం పడిందని పాకిస్థాన్ ఫ్రభుత్వం తెలిపింది. వరదలను తట్టుకునేందుకు వీలుగా రంగంలోకి దిగిన ఆర్మీ కాలువలను తవ్విందని, వీటి ద్వారా వరదలు పొంగిపొర్లకుండా చర్యలు చేపట్టిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సరక్షిత ప్రాంతాలకు తరలించారని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీప్ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి స్థానికులకు ధైర్యం చెప్పారని తెలిపాయి. వరద బాధిత ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐక్యంగా శ్రమిస్తున్నాయని ఆయన అన్నారు. ఇది బాధితులకు సాయం కాదని, తమ బాధ్యతగా షరీఫ్ వ్యాఖ్యానించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu  kashmir  floods  india  pakistan  rescue operations  Army  omer abdullah  nawaz Sharif  

Other Articles