Kcr show his old house to his grandson

kcr, telangana cm kcr, k. chandrashekar rao, telangana, telangana government, kcr family, ktr, ktr family, kcr grand son, mp kavitha, kavitha family, latest news, medak bypoll, elections, kcr house, kcr farm house

telangana cm kcr shows his old home to ktr's son on saturday after he casts vote : kcr's grand son surprised and feel thrilled after he knows kcr old home specialities in chintamadaka of medak district

కుటుంబ ఆస్తులపై కేసీఆర్ ను ప్రశ్నించిన మనవడు

Posted: 09/14/2014 09:38 AM IST
Kcr show his old house to his grandson

కుటుంబ ఆస్తులపై కేసీఆర్ మనవడు ఆరా  తీశాడు. ఈ ఆస్తి ఎవరిది,  ఎవరికి, ఎప్పుడు ఇచ్చారు అని వాకబు చేశారు. మెదక్ ఉప ఎన్నిక సందర్బంగా కేసీఆర్ ను ఆయన మనవడు ప్రశ్నలతో ఊపిరిసల్పకుండా చేశారనుకోండి. అయితే తాత మాత్రం ఓపిగ్గా తనకున్న ఆస్తుల వివరాలను మనవడికి వివరించారు. ఎవరెవరికి ఆస్తులను ఎలా  పంచింది.., ఎలా దానమిచ్చిందీ వివరించాడు. తన ముచ్చట తీర్చిన తాతను శబాష్ కేసీఆర్  అంటూ కితాబిచ్చాడు. ఈ తాతా మనవళ్ళ ఆస్తుల చర్చ ముఖ్యమంత్రి సొంత ఊర్లో జరిగింది.

కేసీఆర్ తండ్రి ఇళ్ళు మెదక్ జిల్లా చింతమడకలో ఉంది. కేసీఆర్ పుట్టి, పెరిగింది ఇక్కడే. రాజకీయాలు ఉద్యమం, పోరాటాలు, పార్టీ కార్యక్రమాల కారణంగా  హైదరాబాద్ కు కొన్నాళ్ళ క్రితం మకాం మార్చారు.  అయినా సరే ఇప్పటికీ ముఖ్యమంత్రి ఓటు చింతమడకలోనే ఉంది. కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాంశ్ కు తాత పుట్టి పెరిగిన ఇళ్ళు చూడాలని ఎప్పటినుంచో కోరిక. ఇళ్ళు చూపించాలని తాతను చాలాసార్లు అడిగాడు కూడా.  అయితే చూపిస్తా చూపిస్తా అంటూ కేసీఆర్ వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. అయితే మెదక్ ఉప ఎన్నిక సందర్బంగా ఓటేసేందుకు ముఖ్యమంత్రి సొంతూరుకు వెళ్ళాల్సి వచ్చింది. దీంతో మనవడికి ఇచ్చిన మాటను గుర్తుంచుకున్న కేసీఆర్..,, హిమాంశ్ కోరికను తీర్చేందుకు చింతమడకకు తీసుకెళ్ళారు.

మనవడిని బయట ఉంచి పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి ఓటు వేశాడు. బయటకు వచ్చాక.., మనవడితో కలిసి పదా మన పాత ఇంటిని చూపిస్తా అంటూ తీసుకెళ్లాడు. పోలింగ్ కేంద్రం నుంచి ఇంటి వరకు నడుచుకుంటూనే వెళ్ళి.., చిన్నప్పటి  జ్ఞాపకాలను నెమరేసుకున్నాడు.  ఇక ఇంట్లోకి తీసుకెళ్లి.., ఇదే తానే పుట్టి పెరిగిన ఇళ్ళు అంటూ  మనవడు హిమాంశ్ కు చూపించాడు. ఇంట్లోని గదులన్నీ ఆసక్తిగా గమనించాడు. ఆ కాలంలో కట్టడాలు, గదుల నిర్మాణంకు ఉన్న ప్రత్యేకతలను  తాత వివరించాడు. బంగ్లా  పైకి ఎక్కి.. చుట్టు పక్కల ప్రదేశాలను చూపించాడు. ఈ సందర్బంగా మనకు ఇంత ఆస్తి ఉందా అని హిమాంశ్ అడగ్గా.., మనదేముందిరా మా చిన్నాన్న ఆస్తులు ఇంకా చాలానే ఉండేవి అని  చెప్పాడు. ఇక ఇంట్లో ఒక్కో గదిని చూస్తూ.., వాటి వివరాలను మనవడు అడిగి తెలుసుకున్నాడు.

మనవడి ప్రశ్నలకు కేసీఆర్ ఓపిగ్గా సమాధానం చెప్పాడు. చింతమడకలో తన బాల్య స్మృతులను మనవడికి వివరిస్తున్న సందర్బంగా  తాత కూడా గత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకున్నాడు. తాత మనవళ్ళ ప్రశ్నలు.., సమాదానాల పరంపరను గమనించిన అధికారులు, పోలిసులు, నేతలు నవ్వుకున్నారు. తెలంగాణను శాసిస్తున్న ముఖ్యమంత్రిని మనవడు నిలబెట్టి ప్రశ్నిస్తున్నాడేంటి అనుకున్నారు. ప్రధానినే ప్రశ్నించి ముచ్చెమటలు పట్టించే కేసీఆర్ హిమాంశ్ ముందు ఇలా  నిలబడి సమాధానాలు ఇస్తున్నాడే అనుకున్నారు. కాని బంధాలు., అనుబంధాల ముందు అధికారాలు.. హోదాలు పనికిరావని తెలుసుకుని మెల్లకుండిపోయారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : medak bypoll  kcr house  kcr family  latest news  

Other Articles