Sheila dikshit clarifies on her comments

sheila dikshit, delhi, bjp, congress

Never said BJP should form government in Delhi, Sheila Dikshit clarifies on her comments

సభ్యుల బలం వుంటేనే ప్రభుత్వ ఏర్పాటు

Posted: 09/13/2014 05:19 PM IST
Sheila dikshit clarifies on her comments

దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్. తన లేటెస్ట్ కామెంట్స్ లో తమకు కావలసినంత తీసుకుని తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆమె మీడియాపైనే మండిపడ్డారు. ఢిల్లీలో బీజేపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాను ఎప్పటికీ అనలేదని ఖరాఖండిగా చెప్పారు. తాను బీజేపిని సమర్థిస్తున్నట్లు వచ్చిన కథనాలను అమె ఖండించారు. తగిన సంఖ్యాబలం వుంటే బీజేపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చనే తాను వ్యాఖ్యానించినట్లు వివరణ ఇచ్చారు.

ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలే వారికి మేలు చేస్తాయన్నారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు దేశ రాజధాని ఢిల్లీలో ఇంకా రాష్ట్రపతి పాలన కొనసాగడం సహేతుకం కాదని అభిప్రాయపడ్డారు. ఒకవేళ బీజేపికి తగు సంఖ్యా బలం వుందని భావిస్తే.. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, ఇది ప్రజలకు శుభ సూచకమంటూ నిన్న చేసిన వ్యాఖ్యాలు అమెను ఇరకాటంలో పడేశాయి. దీంతో వాటిపై ఇవాళ మరోమారు మీడియా ముందుకు వచ్చిన షీలా.. తాను బీజేపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనలేదని వివరణ ఇచ్చారు.

తాను ఢిల్లీ నుంచి బయటకు వెళ్తున్నట్లు చెప్పుకోచ్చిన షీలా.. ఇక యువతరానికి అవకాశాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. తనకు ఢిల్లీ రాజకీయాల్లో ఉండాలని అనిపించడం లేదన్నారు. తనను బలవంతంగా గవర్నర్ పదవి నుంచి తప్పించారని అమె ఆరోపించారు. తనను పదవి నుంచి తప్పించేందుకు ప్రభుత్వ అధికారులు వ్యవహరించిన తీరు సరిగా లేదని చెప్పుకోచ్చారు. 2జీ కుంభకోణం విషయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను సమర్థించిన షీలా.. అప్పడంతా నిమ్మకుండి.. పదవిలోంచి తప్పుకున్న తరువాత ఆరోపణలు చేయడంపై కాగ్ మాజీ చీఫ్ వినోద్ రాయ్ పై మండిపడ్డారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sheila dikshit  delhi  bjp  congress  

Other Articles