Tensions in osmania university with student groups clashes

osmania uniersity, osmania university students, osmania university exams, courses, osmania university tensions, students protests, students organisations, hostels, universities, hyderabad, kcr, government, latest news

ou blazed with students groups wars on wednewday midnight one group attacked on another group : students of a group set fire another groups room in osmania university

ఓయూలో టెన్షన్.. టెన్షన్

Posted: 09/11/2014 09:43 AM IST
Tensions in osmania university with student groups clashes

ఉస్మానియా యునివర్సిటీ రణరంగమైంది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆందోళనలతో అట్టుడికిన క్యాంపస్ ఇప్పుడు విద్యార్థుల వర్గపోరుతో రగిలిపోతోంది. రెండు గ్రూపుల మద్య జరిగిన వివాదం బుధవారం అర్ధరాత్రి పెద్ద ఘర్షణకు దారితీసింది. ఓ విద్యార్థి గ్రూపు రూమును తగులబెట్టే వరకూ గొడవ వెళ్ళింది. ఈ ఘటనలో ఒక హాస్టల్ రూం మొత్తం తగులబడిపోగా.., ఒక విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలిసులు రాత్రికి రాత్రే క్యాంపస్ లోకి అదనపు బలగాలను దింపారు. హుటాహుటిన చేరుకున్న ఉన్నతాధికారులు భారీగా హాస్టళ్ళ సమీపంలో పోలిసులను మోహరించి బందోబస్తు నిర్వహిస్తున్నారు.

కేసీఆర్ పెట్టిన చిచ్చు

వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను దశలవారీగా రెగ్యులరైజ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయం వల్ల తమకు ఉద్యోగాలు రాకుండా పోతాయని విద్యార్థులు క్యాంపస్ లో కొద్ది రోజులుగా దీక్షలు, ఆందోళనల ద్వారా నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం క్యాంపస్ లో చేపట్టిన ర్యాలికి ఓ విద్యార్థి  రాలేదు. అతనిపై ర్యాలిలో ఉన్న పలువురు విద్యార్థులు దాడి చేశారు. ఈ సమయంలో విద్యార్థి సంఘం నేతలు జోక్యం చేసుకుని గొడవ పెద్దది కాకుండా చూశారు. అయితే దాడికి పాల్పడిన విద్యార్థి వర్గం ( విద్యార్థి సంఘానికి చెందిన విద్యార్థులు ) ఉండే హాస్టల్ పై ఓ విద్యార్థి సంఘానికి చెందిన కొందరు వ్యక్తులు బుధవారం అర్ధరారాత్రి దాడి చేశారు. హాస్టల్ లోని సామాగ్రిని ద్వంసం చేశారు.

దీంతో ఇరువర్గాల మద్య ఘర్షణ జరిగింది. ఇదే క్రమంలో దాడి చేసిన విద్యార్థులు మరింత రెచ్చిపోయి.., పీజీ హాస్టల్ లోని 24, 62 రూం నెంబర్లకు నిప్పు పెట్టారు. అంతేకాకుండా ‘ఎ’ హాస్టల్ లో ఉండే నాగుల డాన్ అనే విద్యార్థిపై దాడి చేయగా అతడు తీవ్రంగా గాయపడ్డాడు. విద్యార్థి సంఘాల మద్య దాడుల విషయం తెలుసుకున్న ఉస్మానియా యునివర్సిటీ పోలిసులు హుటాహుటిన క్యాంపస్ లోకి చేరుకున్నారు. పరిస్థితి అదుపుతప్పుతుందని భావించి రాత్రికి రాత్రి అదనపు బలగాలను రప్పించారు. దాడులు చేసుకున్న రెండు గ్రూపులను చెదరగొట్టారు. అన్ని హాస్టళ్ళ వద్ద పోలిసులను మోహరించారు. దాడిలో గాయపడ్డ విద్యార్థి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కాలిబూడిదైన సర్టిఫికెట్లు

ఇక విద్యార్థుల దాడిలో తగులబడ్డ పీజీ హాస్టల్ రూమ్ నెంబర్ 62లో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలార్పివేశారు. కాని అప్పటికే రూం పూర్తిగా తగులబడిపోయింది. రూంలోని విద్యార్థుల పుస్తకాలు, సర్టిఫికెట్లు, బట్టలు, ఇతర వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. రూంను పూర్తిగా మంటలు కమ్మేయటంతో గదిలోని తాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకని బయటకు పరుగులు తీశామని విద్యార్థులు చెప్పారు. తమ చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లన్ని కాలి బూడిదయ్యాయని.., ఇప్పుడు వాటిని ఎలా తెచ్చుకోవాలని.., గవర్నమెంటు ఉద్యోగం వస్తే ఎలా సర్టిఫికెట్లు చూపించాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో ఆంధోళనలతో హోరెత్తిన ఉస్మానియా యునివర్సిటీలో ఇప్పుడు విద్యార్థి సంఘాల మద్య ఈ స్థాయిలో గొడవలు జరగటం పట్ల విద్యార్థి సంఘాల నేతలతో పాటు క్యాంపస్ ఉన్నతాధికారులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఉన్న గ్రూపు రాజకీయాలు, దాడులు చేసుకునేస్థాయి గొడవలు మళ్ళీ రాష్ర్ట విభజన తర్వాత మొదలు కావటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన ఉస్మానియా యునివర్సిటీలో ఇలాంటి ఘటనలు జరగటం వల్ల క్యాంపస్ పేరు దెబ్బ తింటుందని విద్యార్థులు.., విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : osmania university  students  latest news  hyderabad  

Other Articles