Kcr says he never faced defeat in life

kcr, kcr comments, telangana, telangana government, telangana cm kcr, k. chandrashekar rao, ktr, latest news, hyderabad, victory, defeat, narendra modi, elections, trs

telangana cm k.chandrashekar rao says he never faced defeat in his political : during a meeting kcr says he dont know how defeat is because he never faced

ఓటమెరుగని బ్లడ్ నాది - కేసీఆర్

Posted: 09/10/2014 05:21 PM IST
Kcr says he never faced defeat in life

ఓటమి నా బ్లడ్ లోనే లేదు అనే సినిమా డైలాగు అందరికి తెలుసు. ఇప్పుడిదే  డైలాగ్ తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు చెప్తున్నారు. ఓటమి అనేది తన జీవితంలోనే లేదని అంటున్నారు. అనుకున్న ప్రతి ఒక్కటి సాధించానని చెప్తున్నారు. తెలంగాణ అసాధ్యమన్నారు.., కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కాని తెలంగాణ తెచ్చి చూపించానని స్పష్టం చేశారు. ఎన్నికలను చూసుకున్నా పోటి చేసిన ప్రతి చోటా గెలిచిన చరిత్ర తనదని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో నీటి గ్రిడ్ల ఏర్పాటుపై జరిగిన సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు

మళ్ళీ సర్వే చేస్తాం
 
ప్రతి ఇంటికి త్వరలోనే తాగునీటిని అందిస్తామన్నారు. ఒక ఉద్యమంలా ఈ కార్యక్రమం చేపడుతామన్నారు. వాటర్ గ్రిడ్ ఏర్పాట్లపై సర్వే చేస్తామని చెప్పారు. వేల కోట్లు వెచ్చించిన ఈ ప్రాజెక్టు దుర్వినియోగం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందరూ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి తప్ప తనకు మరొక లక్ష్యం లేదని స్పష్టం చేశారు. రాష్ర్టంలో పరిశ్రమలు స్థాపించేందుకు ప్రభుత్వం వద్ద 10లక్షల ఎకరాల భూమి సిద్ధంగా ఉందన్నారు. ఏ రాష్ర్టానికి లేని అవకాశం తెలంగాణకు ఉందని చెప్పారు. తెలంగాణకు త్వరలోనే కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  defeat  telangana  latest news  

Other Articles