Telangana journalists protest against tv9 abn ban in state

telangana, abn andhrajyothy, tv9 telugu, ban on abn andhrajyothy, ban on tv9, telangana channels, telugu news channels, tv channels, yupp tv, latest news, journalists, journalists protest, warangal, hyderabad, delhi, protest, telangana journalists

telangana journalists continuesly protesting to lift ban on tv9, abn channels in state : kcr facing agitations from journalists for banning tv9 and abn in telangana

కేసీఆర్ కు చుక్కలు చూపిస్తున్న జర్నలిస్టులు

Posted: 09/09/2014 01:27 PM IST
Telangana journalists protest against tv9 abn ban in state

ఉద్యమంలో టీఆర్ఎస్ వెనక ఉండి సపోర్ట్ చేసిన జర్నలిస్టులు ఇప్పుడు కేసీఆర్ ముందు ధర్నా చేపడుతున్నారు. చానెళ్లను బంద్ చేయించినందుకు నిత్యం నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ‘వేరేవర్ యు గో అవర్ నెట్ వర్క్ ఫాలోస్ అన్నట్లు’ కేసీఆర్ ఎక్కడికెళితే జర్నలిస్టులు అక్కడ ప్లకార్డులతో ప్రత్యక్షం అవుతున్నారు. మొన్న హైదరాబాద్, నిన్న ఢిల్లీ, ఇవాళ వరంగల్ ఇలా కేసీఆర్ వెంటపడుతూ చుక్కలు చూపిస్తున్నారు. జర్నలిస్టులకు కోపం వస్తే ఎలా ఉంటుందో కేసీఆర్ కు తెలిసేలా చేస్తున్నారు. చానెళ్లను బంద్ చేయించి తమ పొట్టకొట్టవద్దని.., మీడియా స్వేచ్ఛను హరించవద్దని చెప్తున్నారు.

తెలంగాణ శాసనసభ్యుల ప్రమాణస్వీకారంపై టీవీ9 ప్రసారం చేసిన వ్యంగ్య కధనం ప్రసారం చేసినందుకు.., తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ కధనం ప్రసారం చేసినందుకు ఏబీఎన్ చానెళ్లపై చర్య తీసుకుంటామని అసెంబ్లీలో కేసీఆర్ చెప్పారు. ఈ ప్రకటన వచ్చిన వెంటనే రెండు చానెళ్లను తెలంగాణలో ఎం.ఎస్.ఓలు. నిలిపేశారు. దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలైనా చట్టం ప్రకారం ఏమి చేయలేమని కోర్టు తీర్పు ఇచ్చింది. కేంద్ర సమాచార శాఖ కూడా తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అయింది. చానెళ్లు పెట్టిస్తారా.., మేం రంగంలోకి దిగాలా? అని హెచ్చరించింది. అయినా సరే మాట వినకపోవటంతో జర్నలిస్టులే నేరుగా రంగంలోకి దిగారు.

చానెళ్ళను నిషేదించటం ద్వారా మీడియా స్వేచ్చను ప్రభుత్వం హరిస్తోందని జర్నలిస్టులు నిరసనలు తెలుపుతున్నారు. కేసీఆర్ గత వారం ఢిల్లీ పర్యటనకు వెళ్తే కూడా అక్కడ మహిళా జర్నలిస్టు మౌనంగా ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపింది. హైదరాబాద్ లోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం రోజు జర్నలిస్టులు నిరసన తెలిపారు. రోడ్డును పూర్తిగా బ్లాక్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాతో బేగంపేట- పంజాగుట్ట మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఇక కాళోజి శతజయంతి ఉత్సవాల కోసం వరంగల్ కు వెళ్ళిన కేసీఆర్ కు అక్కడ కూడా జర్నలిస్టుల సెగ తగిలింది. కేసీఆర్ వేదిక సమీపంలో జర్నలిస్టులు నిరసన తెలిపారు. చానెళ్లను తెరిపించాలని నినాదాలు చేశారు.

ఆందోళన చేస్తున్న జర్నలిస్టులను పోలిసులు అడ్డుకుని.., అరెస్టు చేశారు. అయినా సరే జర్నలిస్టుల నిరసన ఆగలేదు. ఇంతటితో ఆగుతుందని కూడా చెప్పలేము. మీడియా స్వేచ్చకోసం వారు నిత్యం పోరాడుతూనే ఉంటారు. ప్రసారాలను మేం నిలిపేయమని చెప్పలేదంటున్న ప్రభుత్వానికి చానెళ్లపై నిజంగా కోపం లేకపోతే.., ప్రసారాలు నిలిపివేయవద్దని ఎం.ఎస్.ఓ.లకు ఆదేశాలు ఇవ్వొచ్చుగా.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana journalists  tv9 abn ban  cm kcr  latest news  

Other Articles