Blind believes india girl married with dog

blind believes india, jharkhand village, tribals in india, poor people india, dog girl marriage, girl married with dog

blind believes india girl married with dog : jharkhand village people has done a girl marriage with dog

కుక్కతో పెళ్లి చేసుకుంటే.. దురదృష్టం దూరం!

Posted: 09/04/2014 10:44 AM IST
Blind believes india girl married with dog

(Image source from: blind believes india girl married with dog)

యావత్తు ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మన దేశంలో మూఢనమ్మకాలు మరింతగా పెరిగిపోతున్నాయనడానికి ఇదొక మంచి ఉదాహరణ! ఒకవైపు సాంకేతికరంగంలో భారత్ దూసుకుపోతున్నప్పటికీ.. మరోవైపు మూఢనమ్మకాలు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే అడ్డూఅదుపూ లేకుండా పోతున్నాయి. ఎవరో ఒక చెత్తకుప్పలో జీవనం కొనసాగిస్తున్న డోంగ్రీ బాబు ఏదో చెబితే.. దానిని అలాగే ఫాలో అవుతూ ఇతర ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. అలాగే డబ్బు వ్యామోహంలో బాబాలు అమాయకప్రజలకు ఏవో నమ్మబలికి వారి జీవితంలో దోషముందని.. దాన్నుంచి బయటపడాలంటే రకరకాల ఆచారాలను చేయాల్సి వుంటుందని వారినుంచి కావాల్సిందంతా లక్కుంటున్నారు. ఇలా రకరకాలుగా మూఢనమ్మకాలు వ్యాప్తి చెంది వున్నాయి.

ఇదిలావుండగా.. తాజాగా ఒక విచిత్రకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. కుక్కతో పెళ్లి చేసుకుంటే ఎంతపెద్ద దురదృష్టమైన క్షణాల్లో మటుమాయమంటూ ఎవరో ఒక స్థానిక గురువు చెబితే... ఆలస్యం చేయకుండా ఆ కార్యక్రమాన్ని అప్పటికప్పుడు ముగించేశారు కుటుంబీకులు! జార్ఖండ్ లోని ఓ కుగ్రామంలో జరిగిందీ ఘటన! మంగ్లీ ముండా అనే అమ్మాయికి శునకంతో పెళ్లి చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఈ వినూత్న వివాహాన్ని సందర్శించిన వారందరూ ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నిస్తే... మంగ్లీని దురదృష్టకరం ఫెవిక్విక్ అంటుకున్నట్టు నిత్యం తన వెనకే తిరుగుతోందని.. దాన్నుంచి బయటపడ్డం కోసమే ఇలా కుక్కతో పెళ్లి జరిపిస్తున్నామని కుండబద్ధలు కొట్టేశారు ఆ అమ్మాయి కుటుంబసభ్యులు! కుక్కను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి భవిష్యత్తులో దురదృష్టకరం ఎన్నటికీ దరిచేరదనే నమ్మకంతో ఇలా చేయడం జరిగిందని వాపోయారు. ఇదంతా ఓ స్థానిక మతగురువు తమకు చెప్పాడని వారు స్పష్టం చేశారు.

dog-marriage-girl

ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పెళ్లికూతురు తరఫువాళ్లు ఈ పెళ్లిని అంత సామాన్యంగా తీసిపారేయలేదు. సాధారణంగా మామూలు పెళ్లి ఏ స్థాయిలో జరుగుతుందో.. అదే స్థాయిలో ఈ కల్యాణాన్ని జరిపించారు. పెళ్లికొడుకుకు చేయాల్సిన మర్యాదలన్నీ చేశారు. పైగా.. వివాహం కోసం ఆ కుక్కను కారులో తీసుకురావడం అందరినీ నివ్వెరపరిచేసింది. ఈ స్థాయిలో వీరు పెళ్లి చేయడాన్ని చూసిన గ్రామస్థులు కూడా ఔరా అంటూ చూస్తూ వుండిపోయారు. ఈ వివాహం తర్వాత మంగ్లీకి దురదృష్టకరం దూరమవుతుందని.. అప్పుడు తనకు నచ్చినవాడిని ఆమె వివాహం చేసుకోవచ్చునని చివరికి స్పష్టం చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : blind believes india  tribals  dog girl marriage  

Other Articles