Bank peon in madhyapradesh enmasses crores of assets raided

bank peon, crores assets, madhya pradesh bank peon, gwalior, kuldeep yadav, acb, cbi, latest news, corruption, bank jobs, bank recuritment

peon in madhyapradesh enmassed crores of assets and gold : lokayuktha of madhyapradesh shocked by a bank peon assets of crores

కోట్లు పోగేసిన కో-ఆపరేటివ్ బ్యాంకు ప్యూన్

Posted: 09/02/2014 03:38 PM IST
Bank peon in madhyapradesh enmasses crores of assets raided

ప్యూన్ అంటే.. మనకు ఓ ఆప్రాల్ పోస్టుగానే తెలుసు. నలిగిన బట్టలు.., డీలాగా ఉండే ముఖం, జీతానికి మించిన కష్టాలు. ఆస్తులకు మించిన అప్పులు ఇవే మనకు తెలుసు. సాదారణంగా ఏ ప్యూన్ జీవితం అయినా ఇలాగే ఉంటుంది. కాని మధ్యప్రదేశ్ లో ప్యూన్ మాత్రం అలా కాదు. అతనో కోటీశ్వరుడు. అవినీతి పుణ్యమా అని అమాంతం అంతస్థులు కట్టేసిన ఘనుడు. మద్యప్రదేశ్ రాష్ర్టంలోని గ్వాలియర్ లో ఓ బ్యాంకు ప్యూన్ ఇంటిపై దాడులు నిర్వహించిన లోకాయుక్త అతని ఆస్తులు చూసి నోరెళ్ళబెట్టింది. ప్యూన్ ఏంటి ఇన్ని కోట్ల ఆస్తులు పోగేయడమా అని నోరెళ్ళబెట్టారు

కుల్ దీప్ యాదవ్ అనే వ్యక్తి ఓ కో-ఆపరేటివ్ బ్యాంకులో ప్యూనుగా పనిచేసేవాడు. అతని ఆస్తులపై ఫిర్యాదులు అందుకున్న లోకాయుక్త అధికారులు మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో యాదవ్ కు ఆరు ఖరీదైన బిల్డింగులు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా రెండు లగ్జరీ కార్లు, కోట్ల రూపాయల విలువైన డబ్బు.., నగలను గుర్తించారు. ఉదయం వరకు సోదాల విలువ మూడు కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. అన్ని ఆస్తులపై దాడులు జరిపితే వాటి విలువ ఏడు కోట్ల రూపాయల వరకు ఉంటుందని భావిస్తున్నారు.

1983 నుంచి ఓ కో-ఆపరేటివ్ బ్యాంకులో కుల్ దీప్ ప్యూన్ గా పనిచేసేవాడు. పదవీకాలంలో ఒక్క ప్రమోషన్ కూడా పొందలేదు. ఉద్యోగ సమయంలో కనీసం నోరెత్తి ఎవరినీ ఏ మాట అనలేదు. దీంతో అతని గురించి ఎవరికీ అనుమానం రాలేదు. చివరకు యాదవ్ లీలలు తెలిసిన ఆగంతక వ్యక్తి ఫిర్యాదుతో లోకాయుక్త కదిలింది. కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించి సీజ్ చేసింది. ప్యూన్ ఉద్యోగం కాబట్టి జీవిత కాలమంతా పోగేసినా మహా అయితే ఇరవై లక్షలు రూపాయలు దాటదు. కాని ఏడు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయంటే ఖచ్చితంగా అక్రమాలకు పాల్పడి ఉంటాడని అధికారులు చెప్తున్నారు.

ఇది మన దేశంలో ఒక ప్యూన్ ఆస్తి చిట్టా. కేవలం సాదాసీదాగా ఉండే ప్యూన్ ఏడు కోట్ల రూపాయలు అక్రమంగా పోగేసాడంటే.., పెద్ద పోస్టుల్లో ఉన్నవారి సంగతేంటి. ప్యూనే అవినీతి తిమింగలంగా మారితే.., పై పోస్టుల వారిని ఏ పేరుతో పిలవాలి. ఇక మన రాజకీయ నాయకులు, ఆ మాత్యుల గురించి ఏం మాట్లాడుకోవాలి. ‘‘ఎవరి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.., నేతల చరిత్రంతా అవినీతి, అక్రమాల మయం’’ అన్నట్లు తప్పు చేసే వారికే చట్టాలు చేసే అధికారమిస్తే ఇక భారత్ ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా మారేది?

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bank peon  lokayukta  madhyapradesh  corruption  

Other Articles