Medak bjp mp candidate jagga reddy controversial comments on kcr and trs party

jagga reddy, cm kcr, kcr latest news, jagga reddy latest news, jagga reddy press meet, jagga reddy medak bjp mp candidate, minister harish rao, trs party, telagana state, bjp party

medak bjp mp candidate jagga reddy controversial comments on kcr and trs party

బీజేపీ పెట్టిన భిక్షతో కేసీఆర్ సీఎం అయ్యారా..?

Posted: 09/01/2014 03:43 PM IST
Medak bjp mp candidate jagga reddy controversial comments on kcr and trs party

(Image source from: medak bjp mp candidate jagga reddy controversial comments on kcr and trs party)

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని, ఎన్నో ఉద్యమాలు చేపట్టి, ప్రజల్లో రాష్ట్రంమీద చైతన్యం కల్పించి, తెలంగాణాలో వున్న ప్రజలందరికీ తమకంటూ ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించి, వారికి ప్రత్యేక హోదా కల్పించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)... కేవలం సీఎం పదవికోసమే ఇన్నాళ్లూ ఇలా ఉద్యమాలు చేశారా..? లేదు.. ఇది ముమ్మాటికీ నిజం కానేకాదు... తెలంగాణ ప్రజలకోసం ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించిన ఆ రాష్ట్రప్రజలే ఆయనకు ఆ సీఎం గద్దెనెక్కించారు.

అయితే బీజేపీ పెట్టిన భిక్షంతోనే కేసీఆర్ ఈనాడు సీఎం అయ్యారంటూ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అయిన జగ్గారెడ్డి ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ కుటుంబం అధికారంలో వుందంటే అది బీజేపీ పెట్టిన భిక్షేనని ఆయన అన్నారు. సోమవారంనాడు మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... టీఆర్ఎస్ పార్టీమీద, కేసీఆర్ మీద మరిన్ని వివాదాస్పద వ్యాఖ్యానాలు చేశారు. తన దగ్గర డబ్బుంటే ఎప్పుడో టీఆర్ఎస్ పార్టీ టికెట్ ను కొన్నుకునేవాడినని ఆయన వ్యాఖ్యానించారు.

అలాగే టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు ప్రతిరోజూ జగ్గారెడ్డి అంటూ జపం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయాలమీద కాకుండా అభివృద్ధి విషయంపై మాట్లాడే దమ్ము టీఆర్ఎస్ పార్టీకి వుందా అంటూ ఆయన హరీష్ రావుకు సవాల్ విసిరారు. ఇటీవలే మంత్రి హరీష్ రావు.. ప్రజలు జగ్గారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించలేదని.. ఎంపీగా గెలిపిస్తారనుకోవడం హాస్యాస్పదమని వంటి వ్యాఖ్యానాలు చేసిన నేపథ్యంలో జగ్గారెడ్డి ఇలా ఆయన మీద, టీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద వివాదాస్పద కామెంట్లు చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagga reddy  kcr  harish rao  bjp party  telangana state  

Other Articles