Other party ministers mlas mlcs joining trs party

tummala nageswara rao, talasani srinivas yadav, congress party leaders, congress party assembly ministers, trs party leaders, cm kcr latest news, ck kcr news, chandrababu naidu, vaira ysrcp mla madanlal, congress party illendu mla kanakayya

other party ministers mlas mlcs joining trs party : trs party attracting other party ministers

కేసీఆర్ పట్టుబడ్డారు కానీ.. అనుకున్నది సాధిస్తారా..?

Posted: 09/01/2014 12:13 PM IST
Other party ministers mlas mlcs joining trs party

(Image source from: other party ministers mlas mlcs joining trs party)

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏదైనా ఒక వ్యూహాన్ని రచించారంటే అందులో విజయం సాధించేంతవరకు ఆయన పట్టువదలరని అందరికీ తెలిసిన విషయమే! అప్పట్లో అసెంబ్లీలో తెలంగాణ బిల్లు క్యాన్సిల్ అయిందనే విషయం తెలిసిన వెంటనే.. ‘‘కేవలం 15 రోజుల్లోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి ఢిల్లీ నుంచి వెనక్కు వస్తానని’’ చెప్పిన మాట ప్రకారం ఆయన సాధించి చూపించారు. ఈ విషయాన్ని రాజకీయరంగంలో వున్న సీనియర్ నేతలందరూ అంగీకరించక తప్పదు. ఇక సీఎం పదవి తర్వాత ఆయన రాష్ట్రాభివృద్ధిలో భాగంగా స్పీడు పెంచేశారు. పోలీస్ శాఖ వ్యవస్థను మార్చడంతోపాటు సింగపూర్ టూర్ కెళ్లి అక్కడ బిజినెస్ సమ్మిట్ లో పాల్గొని.. హైదరాబాద్ లో కొత్త పెట్టుబడులు పెట్టించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. అలాగే ఆయన మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు అన్ని పథకాలు, కార్యక్రమాలను పూర్తి చేసేందుకు అన్ని ప్రణాళికలను ఇప్పటికే పూర్తి చేసే పనిలో వున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన తన పార్టీ బలోపేతం మీద పట్టుబడ్డారు.

తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీ ఇంకా బలోపేతం కావాల్సి వుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అంత ఫాలోయింగ్ లేదు. దీంతో కేసీఆర్ ఖమ్మం జిల్లాలో తన పార్టీకి బలోపేతం చేసే పనిలో పూర్తిగా మునిగిపోయారు. ప్రస్తుత తాజా లెక్కలప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే.. ఆ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ హవా విపరీతంగా పెరిగిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా నుంచి టీడీపీ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు రేపోమాపో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా వున్నారు. టీడీపీ పార్టీకి ఆయన ఇప్పటికే రాజీనామా చేశారు కూడా! బడ్జెట్ సమావేశాలకు ముందే కేసీఆర్ కేబినెట్ లో తుమ్మల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశమున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అలాగే ఆ జిల్లాకు చెందిన వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెరాసలోకి చేరడానికి క్యూ కడుతున్నట్టు తెలుస్తోంది.

తాజాగా ఆ జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి చేరడానికి సిద్ధమయ్యారు. సోమవారం సీఎం కేసీఆర్ సమక్షంలో వైరా వైకాపా ఎమ్మెల్యే మదన్‌లాల్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు వెంకట్రావు, రాజేశ్వరరావు, యాదవ్‌రెడ్డిలు చేరబోతున్నట్టు సమాచారం! వీరిలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. ఒకేసారి వివిధ పార్టీల నేతల టీఆర్ఎస్ లోకి చేరడంతో ఖమ్మం జిల్లాలో వుండే పార్టీ బలాబలాలు పూర్తిగా తారుమారయ్యే అవకాశాలు వున్నాయి. మొత్తం 10 అసెంబ్లీ సీట్లున్న ఖమ్మంలో కాంగ్రెస్ - 4, వైసీపీ -3, తెరాస, టీడీపీ, సీపీఎంలు ఒక్కో స్థానాన్ని గెలుచుకున్నారు. అయితే ఈ నేతల చేరికతో ఆ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ పట్టు సాధించినట్లైంది.

రాబోయే రోజుల్లో కూడా ఇతర పార్టీల నుంచి మరిన్ని వలసలుంటాయంటూ టీఆర్ఎస్ నేతల ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇకనుంచి తెలంగాణాలో కేవలం టీఆర్ఎస్ పార్టీ తప్ప మరే పార్టీ ప్రస్థానం వుండబోదన్న అభిప్రాయాన్ని ఆ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతేనేం.. చివరికి సీఎం కేసీఆర్ పట్టుబడినట్లు ఖమ్మం జిల్లాలో తన పార్టీని బలోపేతం చేసుకోవడంలో విజయాన్ని సాధించారని చెప్పుకోవచ్చు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన పార్టీని ఎక్కువ స్థానాలతో గెలిపించుకుంటారా..? లేదా..? అన్నదే వేచి చూడాల్సి వుంటుంది. మరోవైపు మెదక్ ఉపఎన్నిక నేపథ్యంలో నేతలు పార్టీ మారడాన్ని చూస్తుంటే.. టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trs party  medak mp elections  khammam district  kcr  tdp party  congress party  

Other Articles