America releasing a postal stamp on akkineni name

akkineni nageswara rao, nagarjuna, akkineni postal stamp, america post office, america dallas, akkineni family members, akkineni nageswara rao movie, akkineni foundation of america

america releasing a postal stamp on akkineni name : American post office is releasing a new postal stamp on akkineni's name in dallas

అక్కినేని పేరుమీద అమెరికా పోస్టల్ స్టాంప్

Posted: 08/29/2014 05:12 PM IST
America releasing a postal stamp on akkineni name

(Image source from: america releasing a postal stamp on akkineni name)

భారతదేశ చరిత్రలోనే ఇంతవరకు ఏ నాయకుడికి దక్కని అరుదైన గౌరవం అక్కినేని నాగేశ్వరరావుకు దక్కింది. ఆ మహానటుడి జ్ఞాపకార్థంగా అమెరికా తపాలాశాఖ ఒక పోస్టల్ స్టాంపును త్వరలోనే విడుదల చేయడానికి సిద్ధం అవుతోంది. ఈ మేరకు సమాచారాన్ని అక్కినేని ఫౌండేషన్ అధ్యక్షుడు అయిన తోటకూర ప్రసాద్ తెలిపారు. ఇటువంటి గౌరవం దక్కడం భారతీయ చలనచిత్రకే ఒక అరుదైన విజయం అంటూ ఆయన కొనియాడారు.

అక్కినేని జయంతి సందర్భంగా ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన అమెరికాలోని డల్లాస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో ఆయన పోస్టల్ స్టాంప్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. అలాగే డిసెంబర్ 17వ తేదీని అక్కినేని జన్మస్థలమైన గుడివాడలో అక్కినేని కుటుంబసభ్యుల సమక్షంలో జరిగే అంతర్జాతీయ అక్కినేని అవార్డుల కార్యక్రమంలో కూడా ఈ స్టాంప్ ను విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు.

అమెరికాలో అక్కినేనికి సంబంధించిన ‘‘అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’’ (ఏఎఫ్ఏ) చేసిన కృషి ఫలితంగా ఈ గౌరవం దక్కింది. దీంతో కుటుంబసభ్యులతోపాటు చిత్రపరిశ్రమలో వున్న సినీప్రముఖులందరూ ఈ విషయంపై హర్షం వ్యక్తం చేశారు. తెలుగు చిత్రపరిశ్రమకు లభించిన ఒక అరుదైన గౌరవం అని తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles