Power star pawan kalyan quit from medak by election campaign

pawan kalyan, pawan kalyan latest news, pawan kalyan medak elections campaign, pawan kalyan janasena, trs party leaders, nizamabad mp kavitha, mp kavitha comments on pawan kalyan, jagga reddy latest news

power star pawan kalyan quit from medak by election campaign : according to the close members of jagga reddy.. pawan kalyan is not campaingning in medak district by elections due to his backpaign

మెదక్ ఉపఎన్నికల ప్రచారం నుంచి పవన్ ఔట్.. కారణమేంటి?

Posted: 08/29/2014 01:20 PM IST
Power star pawan kalyan quit from medak by election campaign

(Image source from: power star pawan kalyan quit from medak by election campaign)

మెదక్ జిల్లా ఉపఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రస్తుత బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగ్గారెడ్డి మద్దతుగా ప్రచారం చేయనున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే! ఈ విషయం పెద్ద దుమారాన్నే రేపింది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పవన్ పావులు కదుపుతున్నాడంటూ ఆయన మీద ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే ఓయూ జేఏసీ కూడా పవన్‌కు వ్యతిరేకంగా హెచ్చరికలు జారీ చేసింది. పవన్ కల్యాణ్ మెదక్‌లో ప్రచారం చేయడానికి వస్తే అతనిపై రాళ్లదాడి చేస్తామని వాళ్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం బీజేపీ విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పవన్ కల్యాణ్ ప్రచారానికి రావడం లేదని తెలుస్తోంది. దీంతో పవన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న టీడీపీ-బీజేపీ వర్గాలకు గట్టి షాక్ తగిలినట్టయ్యింది.

తాను తీవ్రమైన వెన్నునొప్పి కారణంగా బెంగుళూరులో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నానని.. ఈ కారణంగా సెప్టెంబర్ 13లోపు తాను హైదరాబాద్ రాలేనని పవన్ కల్యాణ్, జగ్గారెడ్డికి మెసేజ్ పెట్టినట్టు ఆయన ప్రధాన అనుచరులు పేర్కొంటున్నారు. తొలుత వాళ్లు పవన్‌కు మెదక్‌లో ప్రచారం చేయాల్సిందిగా ఆహ్వానం పంపిస్తే.. అందుకు ఆయన వెన్నునొప్పి కారణంతో రాలేనని స్పష్టం చేసినట్టు జగ్గారెడ్డి అనుచరులు చెబుతున్నారు. మరోవైపు జగ్గారెడ్డి ప్రచార బాధ్యతలు చూసుకుంటున్న అల్లూరి బాలకృష్ణంరాజు మాత్రం ఈ విషయంపై మరో విధంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ప్రచారానికి రావడం లేదన్న సమాచారాన్ని కొట్టిపారేయలేమని.. ఎన్నికల ప్రచారపర్వంలో ఆకరి రెండు రోజుల్లోనైనా ఆయన్ను తీసుకొచ్చే ప్రయత్నాలు తాము చేస్తామని ఆయన అన్నారు.

పవన్ కల్యాణ్ మెదక్ ఉపఎన్నికల ప్రచారానికి వస్తే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశాలున్నాయనే ఆలోచనతోనే టీఆర్ఎస్ ఆయనపై హఠాత్తుగా విమర్శల దాడి ప్రారంభించిందని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ ఎంపీ కవిత నిన్న పవన్ మైండ్ ఇప్పటికే బ్లేంక్ అయ్యిందని... ఆయనను తెలంగాణ ప్రజలు పట్టించుకోవడం మానేశారని వ్యాఖ్యానించగా... ఓయూ జేఏసీ నేతలు పవన్ ప్రచారానికి వస్తే రాళ్లు విసురుతామని హెచ్చరించినట్లు చెబుతున్నారు. పవన్ మెదక్ ప్రచారానికి వస్తే బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని భయపడిన టీఆర్ఎస్... ఈ విధంగా పవన్‌పై వ్యాఖ్యానాలు చేసినట్లు వారు అభిప్రాయపడుతున్నారు.

కానీ.. పవన్ ఈ ప్రచారం నుంచి తప్పుకోవడంపై రాజకీయ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఓయూ జేఏసీవారు తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ భయంతో మెదక్ ఉపఎన్నికల ప్రచారం నుంచి తప్పుకున్నాడంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అలాగే సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ అనుచరులు భారీ స్థాయిలో పెరిగిపోవడంతో అక్కడ తనకు ఖచ్చితమైన ప్రమాదానికి గురయ్యే అవకాశముందని పవన్ భావించి వుంటాడని, అందుకే తప్పుకున్నాడంటూ సంధిస్తున్నారు. పవన్‌ను టార్గెట్ చేసుకుని ఎంపీ కవిత, హరీష్‌రావులు కూడా విమర్శలు చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles