Banjarahills police filed case on manchu lakshmi and producer bellamkonda suresh

rabhasa movie, bellamkonda suresh, manchu lakshmi, bellam konda srinivas, gandharva mahal, rabhasa movie news, bellamkonda suresh manchu lakshmi, manchu lakshmi case on bellam konda suresh, rabhasa movie review

banjarahills police filed case on manchu lakshmi and producer bellamkonda suresh : a new twist has came in rabhasa movie controversy. Both manchu lakshmi and bellamkonda suresh files case against on them

‘‘రభస’’ మూవీ వివాదంలో సరికొత్త ట్విస్ట్!

Posted: 08/28/2014 05:33 PM IST
Banjarahills police filed case on manchu lakshmi and producer bellamkonda suresh

(Image source from: banjarahills police filed case on manchu lakshmi and producer bellamkonda suresh)

‘‘రభస’’ మూవీ షూటింగ్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు నిజంగానే రభస సృష్టిస్తూనే వుంది. ఆమధ్య నిర్మాత బెల్లంకొండ సురేష్ కు కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వున్నాయనే కారణంగా కొన్నిరోజుల వరకు షూటింగ్ ను నిలిపేసిన విషయం తెలిసిందే! అయితే ఆ సమస్య నుంచి ఏదో ఒరకంగా కోలుకున్న ఈ మూవీ.. తిరిగి మరో వివాదంలో ఇరుక్కున్న సంగతి విదితమే! ఈ నేపథ్యంలోనే అది సరికొత్త మలుపును తిప్పుకుంది. ఎవరూ ఊహించని రీతిలో సరికొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చేసింది.

మంచు ఫ్యామిలీవారి ఆధర్వ్యంలోని ‘‘మంచు ఎంటర్టైన్ మెంట్’’ సంస్థకు చెందిన ‘‘గంధర్వ మహల్’’లో ‘‘రభస’’ మూవీ షూటింగ్ జరుపుకుంది. ఈ సెట్ ను వాడుకున్నందుకు నిర్మాత బెల్లంకొండ మంచివారికి రూ.58 లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ డబ్బులు తమకు ఇంతవరకు ఇవ్వలేదని మంచులక్ష్మీ ఆరోపణలు చేసింది. ఇందులోభాగంగానే మంచులక్ష్మీ తరఫు నుంచి గంధర్వమహల్ మేనేజ్ మెంట్ వారు నిర్మాత సురేష్ ఇంటిముందు నిరసనలు చేశారు. పరిస్థితి చేయిదాటకముందే అక్కడికి చేరుకున్న పోలీసులు వారికి సర్దిచెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అయితే నిర్మాత బెల్లంకొండ సురేష్ చెబుతున్న మాటలు మాత్రం వేరేలా వున్నాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ.. మోహన్ బాబుకు తాను ఇంతకుముందే రూ.10 లక్షలు ఇచ్చానని.. అలాగే మంచు మనోజ్ కు ఓ సినిమాకోసం అడ్వాన్స్ గా రూ.30 లక్షలు ఇచ్చానని చెప్పారు. కానీ కొన్ని అనివార్యకారణాల వల్ల ఆ షూటింగ్ ఆగిపోయిందని చెప్పిన ఆయన... మనోజ్ కి ఇచ్చిన డబ్బులు ఇంతవరకు తనకు తిరిగివ్వలేదని సురేష్ చెప్పారు.

ఇదిలావుండగా.. వీరిద్దరి మధ్య చోటుచేసుకున్న వివాదం ఇప్పుడు పోలీస్ స్టేషన్లదాకా చేరిపోయింది. తనకు డబ్బులివ్వలేదన్న కారణంతో మంచి లక్ష్మీ, బెల్లంకొండపై జైలులో ఫిర్యాదు చేయగా... బెల్లంకొండ కూడా తాను గతంలో మోహన్ బాబు, మనోజ్ ఇచ్చిన డబ్బులు ఇంకా తిరిగివ్వలేదని, ఆ నేపథ్యంలోనే లక్ష్మీకి డబ్బులివ్వలేదని అంటూనే ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ ఒకరిపై ఇంకొకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం వల్ల బంజారాహీల్స్ పోలీసులు వీరిద్దరిపై కేసులు నమోదు చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rabhasa movie  bellamkonda suresh  manchu lakshmi  mohan babu  manchu manoj  

Other Articles