Big fight between jagga reddy and kcr for medak lok sabha mp seat

jagga reddy, kcr, kcr jagga reddy, jagga reddy kcr, kcr latest news, jagga reddy latest news, thoorpu jayaprakash reddy news, jagga reddy pawan kalyan, pawan kalyan jagga redy, jagga reddy bjp party, bjp party jagga reddy

big fight between jagga reddy and kcr for medak lok sabha mp seat

మరోసారి హోరాహోరీ పోరాటానికి సిద్ధమైన కేసీఆర్, జగ్గారెడ్డి!

Posted: 08/27/2014 05:38 PM IST
Big fight between jagga reddy and kcr for medak lok sabha mp seat

రాజకీయ రణరంగంలో ఎప్పుడు, ఎవరు, ఏ పార్టీలో చేరిపోతారో... ఎలా వ్యవహరిస్తారోనన్న అంశాలను ఎప్పటికీ అంచనా వేయలేము. ఒకనాడు చంకలు గుద్దుకున్న నేతలే శత్రువులుగా మారిపోతారు. తమకు సరియైన గౌరవం లభించడం లేదంటూ రాజకీయ హోదాను కల్పించిన అధ్యక్షులపైన తిరుగుబాటు గళాన్ని ఎత్తుతారు. ఈ విషయాల గురించి ఎందుకు చర్చించుకోవాల్సి వచ్చిందంటే... ఇక్కడ కేసీఆర్, జగ్గారెడ్డి వ్యవహారం కూడా అలాగే జరిగింది కాబట్టి! ఒకప్పుడు చాలా సన్నిహితులుగా మెలిగే ఈ ఇద్దరు నాయకులు... ఇప్పుడు భద్రశత్రువులుగా మారిపోయారు. తమ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. దీనంతటికీ కారణం కేవలం రాజకీయరంగమనే చెప్పుకోవచ్చు.

బీజేపీలో వున్న టైగర్ నరేంద్ర అనుచరుడిగా రాజకీయ ఓనమాలు నేర్చకున్న జగ్గారెడ్డి... ఆయనతోపాటు కలిసి టీఆర్ఎస్ పార్టీలోకి చేరిపోయారు. చేరిన వెంటనే ఆయన తన ప్రతిభతో ప్రజలను ఆకర్షించుకున్నారు. దీంతో 2004లో మెదక్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే కాలక్రమంలో ఏమైందో తెలియదు కానీ.. జగ్గారెడ్డి కేసీఆర్ పై రెబెల్ కార్యకలాపాలు కొనసాగించడం మొదలుపెట్టేశారు. ఆ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయి.. అవకాశం చిక్కిన ప్రతిసారి కేసీఆర్ పై నిప్పులు చెరిగేవారు. కేసీఆర్ నే లక్ష్యంగా పెట్టుకుని జగ్గారెడ్డి ఆయనపై లెక్కలేనన్ని సార్లు ఆరోపణలు, విమర్వలు చేసుకుంటూనే వచ్చారు. జిల్లా పార్టీ వ్యవహారాల్లో ఒంటరిగానే తనదైన స్టైల్లో మెదక్ జిల్లాలో పదేళ్లుగా రాజకీయాలు నడిపారు. కార్యకర్తలతో, కాంగ్రెస్ పార్టీ బలంతో గులాబీ బాస్ ను సవాల్ మీద సవాల్ విసురుతూ ఎదుర్కుంటూ వచ్చారు.

అయితే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గాలీ బలంగా వీచడంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో మొత్తం తుడుచుకుపోయింది. జగ్గారెడ్డి కూడా తన ఎమ్మెల్యే స్థానాన్ని కాపాడుకోలేకపోయారు. అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీని ఎట్టిపరిస్థితుల్లోనూ వీడేది లేదని.. తాను కాంగ్రెస్ వాదిగానే కొనసాగుతానని ఆయన పలుమార్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ కేంద్ర అధికారాన్ని చేజిక్కించుకోవడంతో ఆ పార్టీకి శుభాభినందనలను తెలిపారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కూడా ఆయన భేటీ అయి శుభాకాంక్షలు తెలిపారు. దాంతో ఆయన బీజేపీ పార్టీలో చేరునున్నారా అనే అనుమానాలు అప్పుడే వ్యక్తమయ్యాయి కానీ.. వాటిని ఆయన ఖండిస్తూ వచ్చారు. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతూ అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని ప్రకటనలు చేశారు.

ప్రస్తుతం తెలంగాణాలో జరుగుతున్న మెదక్ లోక్ సభ ఉపఎన్నికలు అన్నీ పార్టీలకు కీలకంగా మారాయి. ఇందులో భాగంగానే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడి నుంచి పోటీ చేద్దామని అనుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆయనకు మొండిచెయ్యి చూపించి సునీతా లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చేశారు. దీంతో జగ్గారెడ్డి ఇక ఈ ఎన్నికల నుంచి తప్పుకోవడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ఆయన మాత్రం ఓటమి అంగీకరించకుండా కాంగ్రెస్ నుంచి వైదొలగి వెంటనే బీజేపీ పార్టీలోకి చేరిపోయారు. చేరిన వెంటనే బీజేపీ పార్టీ కూడా ఆయనకు మెదక్ బీజేపీ ఎంపీ టికెట్ ను ఇచ్చేశారు. మొదట్లో ఈ టికెట్ ను అంజిరెడ్డికి ఖరారైందనే వార్తలు వచ్చాయి కానీ... బీజేపీ మాత్రం ఈయన్నే ఈసారి బరిలోకి దించింది. తమ పార్టీని బలోపేతం చేసే దిశలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇలా ఈవిధంగా బీజేపీ కండువాను కప్పుకున్న జగ్గారెడ్డి.. మరోసారి కేసీఆర్ ను ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఇప్పుడు మెదక్ జిల్లా ఎన్నికలు చాలా దుమారంగా మారిపోయాయి. పదేళ్లనుంచి తన సత్తాచాటుకుంటూ వస్తున్న జగ్గారెడ్డి ఇందులో గెలుస్తారా.. లేక కేసీఆర్ తన పలుకుబడితోనే ఇందులో నెగ్గుతారా..? అంటూ అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి జగ్గారెడ్డి మెదక్ పార్లమెంట్ సీటును గెలుచుకుని జిల్లా రాజకీయాల్లో గులాబీ దండు, కేసీఆర్ అధిపత్యానికి గండి కొడుతారా..? లేదా..? అనేది ఆసక్తికరంగా మారిపోయింది. ఇందులో ఎవరు విజయం సాధిస్తారో తెలుసుకోవాలంటే.. మరికొన్ని రోజుల వరకు ఆగాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagga reddy  kcr  pawan kalyan  medak mp lok sabha seat  narendra modi  

Other Articles