Khammam district trs party leader jalagam venkata rao denies cm kcr decision

kcr, kcr latest news, trs party leader jalagam venkata rao, tdp party leader tummala nageswara rao, tdp party latest news, trs party news, trs party leaders

khammam district trs party leader jalagam venkata rao denies cm kcr decision : the rumours are going in trs party that kcr is looking to giving a minister post to tdp party leader tummala nageswara rao from his trs party. By this decision the trs party leader venakata rao getting angry and controversial comments on kcr

టీఆర్ఎస్ పార్టీలో ఆగ్రహజ్వాలలు.. కేసీఆర్ పై ఘాటు కామెంట్లు!

Posted: 08/27/2014 10:38 AM IST
Khammam district trs party leader jalagam venkata rao denies cm kcr decision

రాజకీయరంగంలో స్నేహానికి, శత్రుత్వానికి మధ్య తేడా వుండదని మనందరికీ తెలిసిన విషయమే! ఏ పార్టీ నాయకుడు ఎప్పుడూ ఇతరపార్టీలోకి జంప్ అవుతాడో.. ఎవరెవరు గొడవ పడుతారోనన్న విషయాల గురించి ఎవ్వరూ అంచనా వేయలేరు. ప్రస్తుత మన తెలుగురాష్ట్రాల రాజకీయాలే ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇతర పార్టీల విషయాలను పక్కనపెడితే... తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీలో అప్పుడే ఆగ్రహజ్వాలలు మొదలైనట్టు కనిపిస్తున్నాయి. నిన్నమొన్నటివరకు తమతమ నాయకులమీద భారీగా పొగడ్తలతో ముంచేసుకున్న నేతలే.. ఇప్పుడు సీటు కోసం గొడవ పడుతున్నట్టు తెలుస్తోంది.

హైదరాబాద్, ఖమ్మం జిల్లా మినహా మొత్తం తెలంగాణా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి మంచి పట్టు వుంది. దీంతో ఆ రెండు ప్రాంతాల్లోనూ తన పార్టీని బలోపేతం చేసుకునే దిశలో సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఖమ్మం జిల్లాలో కీలకనేత అయిన టీడీపీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావును టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోవడానికి సర్వం సిద్ధమైంది. (ఆయనకు మంత్రి పదవి ఇవ్వనున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి). తుమ్మలరాకతో తమ పార్టీ ఖమ్మం జిల్లాలో బలపడుతుందనే ఉద్దేశంతోనే ఆయన ఈ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే ఇదే ఇప్పుడు పెద్ద దుమారంగా మారిపోయింది. తుమ్మలను టీఆర్ఎస్ లోకి చేర్చుకోవడమే కాకుండా ఆయనకు మంత్రి పదవిని అంటగడుతున్నారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలందరూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకు కాకుండా ఇతర పార్టీ నాయకులకు మంత్రి పదవులు ఎలా ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

ముఖ్యంగా ఖమ్మం జిల్లా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన జలగం వెంకట్రావు అయితే ఈ విషయంపై తీవ్రంగా మండిపడుతున్నారు. కేసీఆర్ తీసుకుంటున్న ఈ నిర్ణయం న్యాయబద్ధమైంది కాదని వాదనలను వినిపిస్తున్నారు. జిల్లా నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన తనను కాదని.. ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి కనీసం గెలవలేకపోయిన తుమ్మలకు రెడ్ కార్పెట్ ఎలా పరుస్తారని ఆయన ప్రశ్నిస్తున్నట్టు సమాచారం! టీఆర్ఎస్ కు ఏమాత్రం బలంలేని జిల్లా నుంచి గెలుపొందిన తనకు.. ఇచ్చే విలువ ఇదేనా..? అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని ఆయన వెల్లడించారు.

సెప్టెంబర్ మొదటివారంలో టీడీపీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలోకి చేరనున్నట్టు ఖమ్మం జిల్లాలో ప్రచారం జోరుగా కొనసాగుతున్నాయి. కేసీఆర్ ఆలోచనలు కూడా ఇలాగే వున్నాయంటూ ఆ జిల్లాలోని పార్టీ యంత్రాంగం చెబుతోంది. ఒకవేళ ఇదేగనుక జరిగితే మాతరం.. ఖమ్మం జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు ప్రారంభం కావడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ విషయంపై కేసీఆర్ ఎలా స్పందించనున్నారు..? ఆయన్ను పార్టీలోకి చేర్చుకుని మంత్రపదవి ఇస్తారా..? లేదా ఇంకో కొత్త కోణంలో ప్రణాళికలు చేపడుతున్నారా..? ఈ విషయాలన్నీ తెలియాలంటే స్వయంగా కేసీఆర్ పెదవి విప్పితే మాత్రం తెలియదు!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles