Congress won 2 karnataka assembly seats in by polls elections

by poll elections, karnataka by poll elections, congress party, bjp party, congress party bjp party, by poll elections, karnataka by poll electioins

congress won 2 karnataka assembly seats in by polls elections : Karnataka bypoll results: Congress wins 2 seats BJP wins 1, faces shocking defeat in Bellary

బీజేపీకి చెంప ఛెళ్లుమనిపించిన కాంగ్రెస్!

Posted: 08/25/2014 03:22 PM IST
Congress won 2 karnataka assembly seats in by polls elections

మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద షాకే ఇచ్చింది. దేశం మొత్తం మీద అవినీతి పార్టీగా పేరు నమోదు చేసుకున్నప్పటికీ... ఎవరూ ఊహించని రీతిలో ఉప ఎన్నికల్లో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బీహార్, కర్నాటక, పంజాబ్, మధ్యప్రదేశ్ వంటి తదితర రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ చెంప ఛెళ్లమనే విధంగా కర్నాటకలో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. గత ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీతో అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకున్న బీజేపీ.. ఈసారి మాత్రం చాలా కష్టంగా దానికి దక్కించుకోగలిగింది.

కర్నాటకలోని మూడు అసెంబ్లీ స్థానాలకుగాను కాంగ్రెస్ రెండింటిని భారీ ఓట్లతో గెలుచుకోగా.. మూడవ సీటును చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయింది. ముఖ్యంగా బళ్లారి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.వై.గోపాలకృష్ణ... బీజేపీకి పట్టపగలే చుక్కలు కనిపించేలా ఏకంగా 34,000 ఓట్లతో అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నాడు. బీజేపీ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమైన బళ్లారీ గ్రామీణ సీటును ఈసారి కాంగ్రెస్ ఇంతటి భారీ మెజార్టీతో గెల్చుకోవడంతో ఆ పార్టీకి పెద్ద షాకే తగిలింది. నిజానికి ఇక్కడి అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ ఎంపీ శ్రీరాములు స్థాపించినప్పటికీ.. వారికి ఎదురుదెబ్బే తగిలింది.

ఇక చిక్కోడి-సడాలగ అసెంబ్లీ స్థానాన్ని కూడా కాంగ్రెస్ అభ్యర్థి - స్థానిక ఎంపీ ప్రకాష్ హుక్కేరి తనయుడు అయిన గణేష్ హుక్కేరి గెలుచుకున్నాడు. అయితే బీజేపీ పార్టీకి మరో ప్రతిష్టాత్మక అసెంబ్లీ స్థానమైన షికరిపుర సీటును ఆ పార్టీ అభ్యర్థి బి.వై.రాఘవేంద్ర రావు కేవలం 4000 ఓట్లతో గెలుచుకోగలిగారు. గతంలో ఈ స్థానం నుంచే మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.ఎడ్యూరప్ప 2013 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 50000 ఓట్ల భారీ మెజార్టీతో గెల్చుకున్నారు. అలాగే లోక్ సభ ఎన్నికల్లో కూడా 70,000 భారీ మెజారటీతో గెలుచుకున్నారు. కానీ ఈసారి మాత్రం బీజేపీ పార్టీకి ఆ స్థానాన్ని గెల్చుకోవడంలో కాస్త సమస్యల్ని ఎదుర్కోవలసి వచ్చిందనే చెప్పుకోవాలి.

అయితే.. ఎంతో బీజేపీకి ఎంతో ప్రతిష్టాత్మకమైన బళ్లారీ అసెంబ్లీ సీటు ఈసారి ఉప ఎన్నికల్లో ఇంత దారుణంగా ఓడిపోవడంతో ఆ పార్టీ అభ్యర్థిగా ఆ స్థానంలో పోటీ చేసిన శ్రీరాములు పలుకబడి ఒక్కసారిగా తగ్గిపొయ్యాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న రాములకు ఇంత భారీగా ఓటమి చవిచూడాల్సి వస్తుందని ఎన్నటికీ అనుకోలేదు. ఇక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘‘నరేంద్రమోడీ ప్రభావం వల్లే బీజేపీ పార్టీ క్షీణిస్తుందనే సూచనలు వున్నాయని పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karnataka by poll electioins  congress party  bjp party  assembly elections  

Other Articles