Telangana congress meeting for future course

telangana congress, t congress leaders, meeting, vh, digvijay singh, aiccc, inc, sonia gandhi, election result, latest news, politcs, telangana, hyderabad, rangareddy, engeneering colleges

telangana congress replaced old scenes by group politics : congress leaders not changed after the defeat in elections also

కొట్టొచ్చిన కాంగ్రెస్ సాంప్రదాయం. రసాభాసగా సమావేశం

Posted: 08/24/2014 07:34 PM IST
Telangana congress meeting for future course

చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు., ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవిచూసినా.., తెలంగాణ కాంగ్రెస్ నేతల వైఖరి మారటం లేదు. అవే గ్రూపు రాజకీయాలు, వర్గపోరు, ఆదిపత్య వైఖరి.., అన్ని కలగలిపి కాంగ్రెస్ సమావేశం మరోసారి రసాబాసగా మారింది. ఎప్పట్లాగే పార్టీ సాంప్రదాయాన్ని తు.చ. తప్పకుండా పాటించారు నేతలు. రంగారెడ్డి జిల్లా శేరిగూడ సమీపంలోని ఇందూ ఇంజనీరింగ్ కాలేజిలో తెలంగాణ కాంగ్రెస్ సమావేశం జరిగింది. తెలుగు రాష్ర్టాల కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పార్టీ ఓటమికి కారణాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు జరిగిన ఈ సమావేశం నేతలు ఒకరిని మరొకరు తిట్టిపోసుకోవటం.., నాయకత్వంపై కార్యకర్తల విమర్శలకే చోటు కల్పించింది.

వీహెచ్-డిగ్గీ ఢీ: అంటే ఢీ:

కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావుకు ఈ సభలో అవమానం జరిగింది. పార్టీ పరాభవంపై సమీక్ష జరుగుతున్నందున కార్యకర్తలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని వీహెచ్ డిమాండ్ చేశారు. అయితే తర్వాత మాట్లాడిద్దాం అని దిగ్విజయ్ సూచించారు. ఎప్పుడూ సామాన్య కార్యకర్తల వైపుగా ఉండే వీహెచ్ పట్టువీడలేదు. కార్యకర్తలకు అవకాశం ఇవ్వకుంటే ఎందుకీ సమావేశం అని సూటిగా ప్రశ్నించారు. దీంతో డిగ్గీరాజాకు కోపం వచ్చింది. ఏకంగా ఇద్దరూ సమావేశ వేదికపైనే మాటల యుద్ధానికి దిగారు. జోక్యం చేసుకున్న జానారెడ్డి ఇతర నేతలు వీహెచ్ ను పక్కకు తీసుకెళ్ళి శాంతింపజేశారు. కార్యకర్తలకు మాట్లాడే అవకాశం కల్పిస్తామని నచ్చజెప్పారు.

మాట్లాడుతా అంటే సస్పెండ్ చేశారు

కాంగ్రెస్ ఏకపక్ష, నాయకత్వ ఆదిపత్యానికి ఇది మరో ఉదాహరణ. సమావేశం జరుగుతుండగా ఓ నల్గొండ జిల్లాకు చెందిన జ్ఞాన సుందర్ అనే కార్యకర్త తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే వేదిక నుంచి స్పందన రాకపోవటంతో.., తాను సభలో మాట్లాడుతానని కేకలు పెట్టాడు. దీంతో ఆగ్రహించిన దిగ్విజయ్.., కార్యకర్తను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఇలాంటి వారు పార్టికి అవసరం లేదని వేదికపైనుంచే స్పష్టం చేశారు. దీంతో ఇతర కార్యకర్తలు మాట్లాడాలని ఉన్నా.., మనసులో అభిప్రాయాలు చెప్పాలనుకున్నా ఏం జరుగుతుందో అని భయంతో మెల్లకుండిపోయారు.

ఆత్మ విమర్శ ఎక్కడ ?

తెలంగాణ ఇచ్చినా ఇక్కడ పార్టి ఎందుకు అధికారంలోకి రాలేదు. పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం సహా హేమాహేమీలు ఎందుకు ఓడిపోయారు. ఎక్కడ తప్పు జరిగింది. అనే అంశంపై సమావేశంలో ఎక్కడా స్పష్టంగా చర్చించలేదు. ఏ ఒక్క నేత కూడా తన ఓటమికి ఎవరు బాధ్యత అనేది చెప్పలేకపోయారు. తమ నలుపు చూసుకోకుండా ఇతర పార్టీలపై విమర్శలు మొదలు పెట్టారు. ఇందుకు మాత్రం ఏ ఒక్కరూ తీసిపోలేదు. ప్రతి నేత కూడా కేంద్రం, రాష్ర్టంలోని పార్టీలపై విమర్శలు ఎక్కుపెట్టారు తప్ప.., తమ తప్పిదాలను మాత్రం తవ్వి చూసుకోవటానికి ఇష్టపడలేదు.

    వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న పార్టీని ప్రజలు ఎందుకు తిప్పికొట్టారు. దేశ వ్యాప్తంగా తమకు వ్యతిరేక పవనాలు ఎందుకు వీచాయి. మనం సరిగ్గా పరిపాలిస్తే ప్రతిపక్షం కూడా దక్కించుకోలేని స్థాయికి ఎందుకు దిగజారారు అని ఏ నేత కూడా సమావేశంలో మాట్లాడలేదు. ఇంకెక్కడ ఆత్మ పరిశీలన, సమీక్ష జరిగినట్లు. తప్పులు ఒప్పుకుని, సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలని కోరినపుడే కదా ప్రజల్లో మళ్ళీ ఆలోచన కలిగేది. అది జరగనంత వరకూ ఇలాగే దేశంలో అత్యంత చరిత్ర కలిగిన పార్టీగా చరిత్రకు పరిమితం కాక తప్పదు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Police constables rape attempt in bellampalli
T ministers fail to convince cm n kiran kumar reddy on telangana  
Rate This Article
(0 votes)
Tags : telanagana congress  digvijay singh  vh  latest news  

Other Articles