Narendra modi government approved one lakh crores budget for digital india

narendra modi, pm narendra modi news, central government, digital india, digital india budget, digital india modi, narendra modi press conference, narendra modi latest news, central government narendra modi

narendra modi government approved one lakh crores budget for digital india : The prime minister of india narendra modi government has approved one lakh crores budget for digital india

‘‘డిజిటల్ ఇండియా’’ కోసం లక్షకోట్లకు ఎసరు పెట్టిన మోడీ!

Posted: 08/21/2014 10:41 AM IST
Narendra modi government approved one lakh crores budget for digital india

భారతదేశాన్ని ‘‘డిజిటల్ ఇండియా’’గా మొత్తం రూపురేఖలే మార్చేస్తామంటూ ప్రధాని నరేంద్రమోడీ గతంలో ఎన్నో వ్యాఖ్యానాలు చేసిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయాన్ని వెల్లడించింది. దేశాన్ని పూర్తిస్థాయిలో డిజిటల్ దేశంగా మార్చే బృహత్తర కార్యక్రమానికి మోడీ సర్కార్ పచ్చజెండా ఊపడంతో... ‘‘డిజిటల్ ఇండియా’’ పేరుతో సుమారు రూ.లక్ష కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే అన్నిరంగాల ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించేందుకు ఎలక్ట్రానిక్ విధానంలో అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ చేసుకుని ఈ అత్యాధునిక ఐటీ ప్రయోజనాలను కల్పించడానికి ప్రబుత్వం సిద్ధమైంది.

బుధవారంనాడు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్.. ‘‘డిజిటల్ ఇండియా’’ పథకానికి ఆమోదం తెలిపింది. కేబినెట్ తో భేటీ అయిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ పథకం గురించి మాట్లాడుతూ... ‘‘ఈ పథకాన్ని ఈ ఏడాదిలోనే మొదలుపెట్టి, 2018లోపు పూర్తి చేస్తాం’’ అని ఆయన వెల్లడించారు. అన్ని మంత్రిత్వశాఖలు చేపట్టే ప్రాజెక్టులు ఇందులో వుంటాయని.. అందుకోసం రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు అయ్యే అవకాశం వుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ పథకంలో భాగంగా.. గ్రామపంచాయితీ స్థాయిలో హైస్పీడ్ ఇంటర్నెట్, ప్రభుత్వ విద్య - వైద్య సేవల్లో పురోగతి, డిజిటల్ అక్షరాస్యత ద్వారా గ్రామీణులకు విజ్ఞానాన్ని అందించడం, మొబైల్ కనెక్టివిటీ, ఈ - గవర్నెన్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఉద్యోగాల కల్పన, వ్యవసాయంలో ఐటీ వినియోగం వంటి తదితర లక్ష్యాలను కేంద్రం నిర్దేశించింది. ఈ పథకం పనితీరును ఎప్పటికప్పుడు ప్రధాని మోడీ నేతృత్వంలోని కమిటీతోపాటు ఆర్థిక వ్యవహరాల కేబినెట్ కమిటీ కూడా పర్యవేక్షిస్తుంటుంది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ‘‘డిజిటల్ ఇండియా’’ పథకం కోసం ఉద్దేశించిన ప్రాజెక్టులకు అనుమతులు మంజారు జారీ చేస్తుంది.

కేంద్రమంత్రివర్గంలో తీసుకున్న ఇతర నిర్ణయాలు ఇలా వున్నాయి...

1. నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా వున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రూ. 3126 కోట్ల వ్యయంతో మొత్తం 1836 ‘బేస్ ట్రాన్స్ మిషన్ టవర్ల’ ఏర్పాటు.

2. ఇనుము, బాక్సైట్ తదితర 55 రకాల ఖనిజాలపై రాయల్టీ పెంపుదల

3. ఉల్లిగడ్డ కనీస ఎగుమతి ధరను టన్నుకు 350 అమెరికా డాలర్లకు తగ్గించారు.

ఇదిలావుండగా... ఇంకా ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొంతమంది కేంద్రం తెలిపిన ఈ బడ్జెట్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. యావత్తు భారతదేశంలో వున్న గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం లక్షకోట్ల వ్యయం సరిపోదని వాపోతున్నారు. మోడీ కాంగ్రెస్ నియమాలను కాపీ కొడుతున్నారని... ఆయన స్వతహాగా నిర్ణయాలు ఏమీ తీసుకోవడం లేదని చెబుతున్నారు. డిజిటల్ ఇండియా పేరుతో మోడీ ప్రభుత్వం లక్ష కోట్లకు ఎసరు పెట్టిందని ఆరోపణలు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  central government  digital india  indian budget  

Other Articles