East godavari district collector neetu prasad turned as farmer

east godavari district collector neetu prasad, collector neetu prasad, east godavari district news, collector neetu prasad latest news, neetu prasad turned as farmer

east godavari district collector neetu prasad turned as farmer : The east godavari district collector neetu prasad turned as farmer to know their difficulties.

రోజువారి కూలీగా మారిన జిల్లా కలెక్టర్!

Posted: 08/13/2014 06:38 PM IST
East godavari district collector neetu prasad turned as farmer

నిన్నామొన్నటివరకు తన ఆఫీస్ లో ఏసీ కింద ఒక కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని... అధికారాలకు ఆర్డర్లు ఇస్తూ సుఖంగా కాలాన్ని గడిపిన ఒక జిల్లా కలెక్టర్... నేడు ఏమయిందో ఏమో తెలీదు కానీ వున్నట్లుండి రోజువారి కూలీగా మారిపోయారు. జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి ఒకేసారి గ్రామకూలీ స్థాయికి చేరిపోయారు. ప్రస్తుతం ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారిపోయింది. జిల్లా కలెక్టర్ కూలీగా ఎలా మారిపోయారు..? ఏం జరిగింది..? ఆ కలెక్టర్ ఎవరు..? అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ఆ కలెక్టర్ మరెవ్వరో కాదు.. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా కొనసాగుతున్న నీతూ ప్రసాద్.

అసలు విషయం ఏమిటంటే.. ప్రజల కష్టనష్టాలు కేవలం వినడం మాత్రమే కాకుండా... వారితో మమేకమై వారి జీవనసరళిని, విధానాలను దగ్గరగా గమనించడానికి ఆమె ఇలా కూలీగా అవతారమెత్తాల్సి వచ్చింది. ప్రజలతో కలిసిపోయి కొత్తపద్ధతులకు నాంది పలుకుతూ ఈ సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రజలతో కలిసివుంటూ, వారు చేస్తున్న పనుల్లో మనం కూడా కొంచెం పాలుపంచుకుంటే వారి జీవన విధానాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చుననే అభిప్రాయంతోనే ఆమె రైతుల దైనందిన జీవితాల్లోకి చేరి.. వారిలాగే రైతులా మారిపోయారు. ఒక జిల్లా కలెక్టర్ అయినా కూడా అవేమీ పట్టించుకోకుండా ప్రజల బాధలను, కష్టనష్టాలను తెలుసుకోవడానికి ఇలా రైతుగా మారి వారితో కలిసిపోయారు.

కలెక్టర్ నీతూ ప్రసాద్ తాను వెళ్తున్న మార్గమధ్యంలో ఒక చోట నాట్లు వేస్తున్న రైతులను చూసి వెంటనే కారు నిలబెట్టారు. వెంటనే కారులోంచి దిగి.. రైతులతో కలిసి నాట్లు వేశారు. దీంతో అక్కడున్న రైతులు ఒక్కసారిగా షాక్ కు గురై.. సాక్షాత్తూ కలెక్టర్ తమతో కలిసి నాట్లు వేయడాన్ని చూసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ బాధలను వారు కలెక్టర్ తో పంచుకున్నారు. ప్రజలను కలవడానికి, వారి కష్టనష్టాలు తెలుసుకోవడానికి ఇదొక చాలా సులభమైన విధానమని నీతూప్రసాద్ పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles