Defamation suit filed against tv9 abn and tv 6 channels ex mla sridhar

ex mla sridhar, defamation suit, TV 9, ABN, TV 6, telangana state, media channels, media channels banned in telangana, tv9 media, abn channel

defamation suit filed against tv9-abn and tv 6 channels: ex mla sridhar

టీవీ9-ఏబీఎన్ల పై కొత్త వివాదం తెచ్చిన ఎమ్మెల్యే !

Posted: 08/13/2014 03:23 PM IST
Defamation suit filed against tv9 abn and tv 6 channels ex mla sridhar

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో టీవీ9-ఏబీఎన్ ఛానల్స్ మూగబోయిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర స్థాయిలో చర్చలు జరిగాయి. నాయకుల మద్య మాటల యద్దం జరిగింది. అయినా ఈ రెండు ఛానల్స్ పై కొందమంది రాజకీయ పెద్దలు కక్ష కట్టినట్లు తెలుస్తోంది. అలాంటి వారిలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఒకరు.

ఇప్పుడు మూడు ఛానల్స్ పై దావా వేయటం జరిగింది. టీవి9, ఏబిఎన్ మరియు టీవి6 ఛానల్స్ పై మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ దావా వేశారు. ఈ మూడు ఛానెళ్లు వల్ల ఆయన పరువు పోయిందట. అంటే ఇప్పుడు కాదులేండి. ఎన్నికల సమయంలో ఈ మూడు ఛానల్స్ కలిసి తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగేలా కథనాలను ప్రసారం చేశాయని శ్రీధర్ ఆరోపిస్తున్నారు.

అంతేకాండా తలెంగాణ ప్రజల మనోభావాలను అవమానపరిచే విధంగా.. ప్రత్యేక కథనాలు ప్రసారం చేయటంతో , తెలంగాణ ప్రజలు పరువు, నా పరువు పోయింది. అందుకే ఈ మూడు ఛానల్స్ పై దావా వేసినట్లు ఆయన మీడియా ముందు చెప్పటం జరిగింది. దీంతో టీవీ9, ఏబిఎన్ ఛానల్స్ కు మరో మీడియా టీవి6 కూడా వివాదంలో చిక్కుకుంది. దీంతో మీడియా ఛానల్స్ అంటే ప్రతి ఒక్కరికి చులకన అయ్యింది.

మాజీ ఎమ్మెల్యే దావా నుండి ఈ మూడు మీడియా ఛానల్స్ ఎలా బయటపడతాయో చూద్దాం!! తెలంగాణలో మీడియా వారికి రక్షణ లేదని దేశం మొత్తం తెలిసిపోయింది. తెలంగాణలో రాజకీయ నాయకులదే హవా! రాజకీయ నేతలకు నచ్చితే ఒకే!! నచ్చకపోతే ఇలాంటి కష్టాలు ఆటోమెటిక్ గా వస్తాయని చెప్పటం జరుగుతుంది. ఈ రాజకీయ నేతల కబందహస్తల నుండి మీడియా ఎలా బయటపడుతుందో చూద్దాం.!!!

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana state  media issue  telangana msos  tv9  abn channel  tv6  

Other Articles