Terrorists ten years son poses in gruesome photo

terrorist son, gruesome photo, khaleed sharouff, ten years body, Australian upset by photo of grandson,Australian newspaper

Terrorists ten years Son Poses in Gruesome Photo: An Australian newspaper on Monday published a photograph of a child it said was the son of an Australian convicted terrorist

నరికిన తలతో ఫోటోకు పదేళ్ల బాలుడు ఫోజు!

Posted: 08/12/2014 10:12 AM IST
Terrorists ten years son poses in gruesome photo

మీరు పదేళ్ల వయసులో ఏం చేసి ఉంటారు? సహజంగా అందరు ఆడుతూ పాడుతూ గడిపి ఉంటారు. కానీ ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న బాలుడు మాత్రం అలా కాదు.. నరేకేసిన మనిషి తలతో ఫోటకు ఫోజు ఇచ్చాడు. ఇది చాలా విచిత్రం. ప్రపంచంలో మొట్ట మొదటిసారి పదేళ్ల బాలుడు ఒక మనిషి తలను పట్టుకోని ఫోటోకు ఫోజు ఇవ్వటం జరిగింది. అయితే ఈ ఫోటో ఫోజు వెనుక అతన తండ్రి హస్తం ఉంది. ఆ బాలుడు తండ్రి ఒక ఉగ్రవాది.

సిరియా సైనికుడి తల నరికేసి.. ఆ తలను ఓ కుర్రాడి చేతికి ఇచ్చి ఫొటో తీశారు. ఆ కుర్రాడు కూడా.. ఓ ఆస్ట్రేలియా ఉగ్రవాది కొడుకు కావడం గమనార్హం. ఈ ఫొటోను ఆస్ట్రేలియా దినపత్రిక ఒకటి ప్రచురించింది. దీన్ని బట్టే ఉగ్రవాదులు ఎంత అరాచకంగా ఉన్నారో అర్థమవుతుందని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ వ్యాఖ్యానించారు.

ten-years-boy-terrorists

ఖలీద్ షరౌఫ్ అనే ఉగ్రవాది కొడుకు ఈ తల పట్టుకున్నట్లుగా ఉన్న ఫొటోను ముందుగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా పత్రిక ప్రచురించింది. అతడు తన కొడుకేనని షరౌఫ్ కూడా గర్వంగా చెప్పాడు. సిరియా ఉత్తర భాగంలోని రక్కా ప్రాంతంలో ఆ ఫొటో తీశారు. దీన్ని ఇస్లామిక్ స్టేట్ రాజధానిగా ఇస్లామిక్ ఖలీఫా ప్రకటించుకున్నారు.

ఉగ్రవాది షరౌఫ్ తన సోదరుడి పాస్ పోర్టు ఉపయోగించుకుని భార్య, ముగ్గురు కొడుకులతో కలిసి సిరియా, ఇరాక్ దేశాలకు గత సంవత్సరమే పారిపోయాడు. ఆస్ట్రేలియా ప్రభుత్వం అతడిని దేశం వదిలి వెళ్లకూడదని నిషేధించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ అతడిపై ఆస్ట్రేలియన్ పోలీసులు అరెస్టు వారెంటు కూడా జారీ చేశారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australian newspaper  photograph of terrorist  terrorist  Militant news  

Other Articles