Telugu boy guinness record in 24 hours at telangana state

telugu boy guinness record, telugu boy guinness record in 24 hours, 10th class boy guinness record in telangana, high school boy guinness record, telangana cm kcr

telugu boy guinness record in 24 hours at telangana state: gangarapu akhil ruinness record in warangal

తెలుగు పిలగాడు.. 24 గంటలో గిన్నిస్ రికార్డు!

Posted: 08/08/2014 12:58 PM IST
Telugu boy guinness record in 24 hours at telangana state

15 సంవత్సరాల బాలుడు .. చదివేది .. 10వ తరగతి.. అయినా 24 గంటల్లో గిన్నిస్ రికార్డు సాధించాడు. వయసు సంబంధంలేదు.. మనిషి తలచుకుంటే. ఏ వయసులోనైన అద్బుతాలు సృష్టించగలడని నిరూపించారు. ‘‘పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదే’’. అల్లారి ఆటలు ఆడే వయసులో గిన్నిస్ రికార్డు సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చాడు.. గంగారపు అఖిల్ .

పుట్టింది వరంగల్ జిల్లా.. చదుకోసం హన్మకొండలోని మర్కజీ హైస్కూల్ లో 10వ తరగతి తెలుగు మీడియం చదువుతున్న అఖిల్ 24 గంటలపాటు భారత రాజ్యాంగం-చరిత్ర అంశంపై ఏకధాటిగా ఉపన్యాసం చేసి రికార్డు నెలకొల్పాడు.
బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభించిన ఉపన్యాసాన్ని గురువారం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగించాడు.

ప్రతి మూడుగంటలకు ఒకసారి ఐదు నిమిషాల చొప్పున విశ్రాంతి తీసుకున్న అఖిల్ విజయవంతంగా రికార్డు సాధించాడు. ఈ సందర్భంగా గిన్నిస్‌బుక్ రికార్డు ప్రతినిధులు సర్టిఫికెట్ అందజేశారు. అఖిల్ ఉపన్యాస కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దేవేందర్‌రెడ్డి ప్రారంభించగా ముగింపు కార్యక్రమానికి డీఈవో డాక్టర్ ఎస్ విజయ్‌కుమార్ హాజరయ్యారు.

ప్రతి రెండు గంటల చొప్పున ఉపాధ్యాయులు అఖిల్ ఉపన్యాసానికి పర్యవేక్షకులుగా వ్యవహరించారు. పట్టుదలతో గిన్నిస్ రికార్డును సాధించిన అఖిల్‌ను డీఈవోతోపాటు పాఠశాల ఉపాధ్యాయులు, మిత్రులు అభినందించారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు .. గారు ఈ పిలగాడికి ఎలాంటి బహుమతి ఇస్తాడో చూద్దాం !! గ్లామర్ చూపించి కోట్లు , లక్షలు కొట్టేసిన భామల కంటే.. తెలంగాణ పేరును గిన్నీస్ రికార్డు లో చేర్చినందుకు సీఎం కేసిఆర్ ఎలాంటి గిఫ్ట్ ఇస్తాడో చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles