Dna test for telangana nativity

DNA Test, Telangana nativity, Lakshmi Parvathi comments KCR, Lakshmi Parvathi comments Chandrababu, AP CM Chandrababu Naidu, Telangana CM KCR

DNA test for Telangana nativity: Lakshmi Parvathi comments on KCR way of functioning

డిఎన్ఏ టెస్ట్ తో స్థానికత నిర్థారణ?

Posted: 08/08/2014 08:31 AM IST
Dna test for telangana nativity

ఆ ఏర్పాటు లేదు కానీ ఉంటే మాత్రం కెసిఆర్ తప్పకుండా ఆంధ్రా తెలంగాణావాళ్ళ స్థానికత నిర్ధారణకు డిఎన్ఏ టెస్ట్ చేయించటానికి ఆదేశాలిచ్చుండేవారని ఎన్ టి ఆర్ తెలుగుదేశం పార్టీ సంస్థాపకురాలు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు లక్ష్మీ పార్వతి విమర్శించారు.  

టివిలో రాజకీయ చర్చలో మాట్లాడుతూ ఇరు రాష్ట్రాలలోను ఇప్పటివరకు ఏమీ జరగలేదు ఒక్క మాటలు తప్ప అన్న లక్ష్మీ పార్వతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ల పేరుతో గంటలుగంటలు ఐఏఎస్ లతో మాట్లాడి వాళ్ళనీ పని చేసుకోనివ్వటం లేదని, తనూ ఏమీ చెయ్యటం లేదని విమర్శించినా, ఆయన తెలంగాణా ముఖ్యమంత్ర కెసిఆర్ కంటే నయమేనని, కెసిఆర్ మాత్రం రోజుకో మాట చెప్తూ మాటల మాంత్రికుడిలా ప్రవర్తిస్తూ ఫీజ్ రియంబర్స్ మెంట్ విషయంలో కానీ ఋణ మాఫీల విషయంలోకానీ ఎటూ తేల్చకుండా జాప్యం చేస్తున్నారని అన్నారు.  

ఆంధ్రా తెలంగాణా విద్యార్థుల స్థానికతకు 1956 కటాఫ్ ఇయర్ గా తీసుకున్న కెసిఆర్, డిఎన్ఏ టెస్ట్ చేయించటానికి కూడా వెనకాడివుండేవారు కాదని, కాకపోతే అలా స్థానికతను నిర్ణయించే ఆ వెసులుబాటు డిఎన్ఏ టెస్ట్ లో లేకపోవటం వలన ఆ పని చెయ్యలేదని అన్నారావిడ.  నిధులు లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందులలో ఉన్న మాట నిజమే కానీ, ఆ రాష్ట్రంతో పోలుస్తూ ఫీజ్ రియంబర్స్ మెంట్ లో ఇంకా ఆలస్యం చెయ్యటం, ప్రతి విషయంలోనూ పోటీలు పడటం, రైతు ఋణమాఫీలు కూడా చంద్రబాబు నాయుడు వలనే ఆగిపోయిందని అనటం లాంటివి కెసిఆర్ కే చెల్లిందన్నారు లక్ష్మీపార్వతి.

తెలంగాణా స్థానికత నిర్ధారణకు లక్షమంది సిబ్బందితో కెసిఆర్ సర్వే చేయిస్తున్న సంగతి తెలిసిందే.  వీలు లేక కానీ, డిఎన్ఏ టెస్ట్ తో స్థానికత నిర్థారణ అయ్యే వెసులుబాటుంటే మాత్రం కెసిఆర్ అంత లోతుగానూ పోయుండేవారన్నది లక్ష్మీపార్వతి వాదన.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles