అయ్యా.. !! ఆంద్రప్రదేద్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు.. మీరు చేస్తున్న పని ఏమిటి? మీరు జీవో సంగతి అప్పడే మరిచిపోయావా? .. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొండి సార్!!! ఒకవైపు పొదుపు పాటించాలని మంత్రులకు హితబోధ చేస్తూనే, మరోవైపు సమావేశాల కోసం లక్షల్లో ఖర్చు చేయటం ఏమైన న్యాయమా?
ఈరోజు సీఎం చంద్రబాబు విజయవాడలో కలెక్టర్ల సమావేశం జరుగుతోంది. ఇందుకోసం ఫైవ్‌స్టార్ హోటల్ని వేదికగా చేసుకున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులకు తాజ్ గేట్ వేలో స్పెషల్ షూట్లను బుక్ చేశారు. ప్రభుత్వ కార్యదర్శికి, మిగతా కార్యదర్శలకు స్టార్ హోటల్లో విడిదిగా ఏర్పాటు చేయగా... జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సిటీ పోలీసు కమిషనర్లకు మినర్వా, ఐలాపురం హోటళ్లు రెడీ చేశారు.
ఏపీ ప్రభుత్వం స్టార్ హోటల్లో సమావేశాలు నిర్వహించడమేంటంటూ రాజకీయ పార్టీల్లో చర్చ మొదలైంది. ఆర్థికస్థితి బాగా లేకపోవడంతో స్టార్ హోటల్లో అధికారిక కార్యక్రమాలను నిషేధిస్తున్నట్లు కొద్దిరోజుల కిందట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈలోగానే స్టార్ హోటల్లో సమావేశం నిర్వహించడం రాజకీయ నేతలకు అంతుబట్టడంలేదు. ప్రభుత్వ సమావేశాలకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీని గతంలో ఎంపిక చేసినప్పటికీ పార్కింగ్ సమస్య తలెత్తడంతో వేదికను మార్చినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.
విజయవాడ సమావేశానికి ముప్పై లక్షల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. మంత్రులు, ఐఎఎస్, ఐపిఎస్ లు అంతా అక్కడకు వెళ్లారు.కాగా కర్నూలు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి బస చేయడానికి వీలుగా అతిది గృహాన్ని ముప్పై లక్షల వ్యయంతో పునరుద్దరణ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ తీరుపై ఇటు వైసీపీ, అటు కాంగ్రెస్ నేతలు పసుపు చొక్కలను ఉతికారేస్తున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more