Abusing postings on araku mp kottapalli geetha

araku mp kottapalli geetha news, physical harassement on araku mp kottapalli geetha, ysrcp mp kottapalli geetha, warning calls to araku mp kottapalli geetha, warning calls to ysrcp lady mp geetha, araku mp kottapalli geetha met with chandrababu naidu, chandrababu naidu latest news, ys jagan mohan reddy latest news, abusing posts araku mp kottapalli geetha

abusing comments on araku mp kottapalli geetha : Abusing postings on araku mp kottapalli geetha in facebook and warning calls after met with ap cm chandrababu naidu

బాబును కలిసిన జగన్ ఎంపీ ‘‘గీత’’పై వేధింపులు!

Posted: 08/01/2014 06:46 PM IST
Abusing postings on araku mp kottapalli geetha

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫును అరకు నుంచి ఎంపీగా ఎన్నికైన కొత్తపల్లి గీతకు వేధింపులు, బెదిరింపులు చాలా ఎక్కువయ్యాయని ఆమె ఆరోపణలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కలిసిన తర్వాత నుంచి ఈ వేధింపులు మొదలయ్యాయని... తనపై చాలా దారుణంగా, అసభ్యకరమైన మెసేజ్ లను ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఒక ఎంపీ అయినా కూడా అవేమీ చూడకుండా ఆమెకు మానసిక దాడికి గురుచేశారని ఆమె వాదనను వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ.. అరకులో వున్న సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో మాట్లాడటానికి కలిశానని స్పష్టం చేసింది. అయితే ఆయనతో సమావేశం జరిగిన తరువాత నుంచి తనకు ఫోన్లో బెదిరింపులు వస్తున్నాయని ఆమె తెలిపారు. ఫోన్ ఇంకెవరైనా ఎత్తితే.. అటువైపు నుంచి కేవలం మైనమే సమాధానంగా వుంటోందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ వెల్లడించారు. ఇంతటితో ఆగకుండా.. చివరికి తన ఫేస్ బుక్ ఖాతాలో కూడా అసభ్యకరమైన సందేశాలు పోస్ట్ చేస్తున్నారని ఆమె రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేశారు.

అయితే ఒక ఎంపీపై ఈ రకమైన మానసిక దాడి చేయాల్సిన అవసరం ఎవరికి వుంటుందా? అని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఇదిలావుండగా.. వైఎస్సార్పీపీ నుంచి ఎవరైనా బయటకు వస్తే.. ఇటువంటి అనుభవాలే ఎదురవుతాయని పలువురు నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఇటువంటి దాడులకు రాజకీయ నేతలే పాల్పడుతున్నారా..? దగ్గర సన్నిహితులే చేయిస్తున్నారా..? లేక వైఎస్సార్సీపీ అభిమానులు ఇటువంటి ఘాతుకానికి పాల్పడుతున్నారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే తాజాగా అందిన సమాచారాల ప్రకారం.. ఏపీ ఐపీ అడ్రస్ ల నుంచే ఫేస్ బుక్ లో ఇలా అసభ్యకరంగా పోస్ట్ చేశారని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles